జగన్ ఇలా చేస్తారనుకోలేదు, ఆ మాటలు చాలా బాధించాయి: అఖిల ప్రియ

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చావును కూడా రాజకీయం చేస్తారని తాను అనుకోలేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ గురువారం అన్నారు.

ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అసెంబ్లీలో తన తండ్రి భూమా మృతికి సంతాపం తెలిపిన సమయంలో రాకపోవడం, ఆ తర్వాత ఆయన పైన వ్యాఖ్యలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

AKhila Priya unhappy with YS Jagan's comments

బాధలో ఉన్న పరిస్థితుల్లో తాను ఇప్పుడు విమర్శలు చేసి, మళ్లీ అనిపించుకోదల్చుకోలేదని అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడు కూడా జగన్ పైన వ్యక్తిగత విమర్శలు చేయలేదని అఖిల ప్రియ చెప్పారు.

తన తండ్రి చనిపోయినప్పుడు కూడా జగన్ అలా మాట్లాడటం చాలా బాధించిందని అన్నారు. తాను అమ్మానాన్నల గౌరవాన్ని నిలబెడతానని చెప్పారు. తాము మంత్రి పదవి కోసమే టిడిపిలో చేరామని చెప్పడం సరికాదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Allagadda MLA and Telugudesam Party leader Akhila Priya
Please Wait while comments are loading...