ADITYA L1: మరో చరిత్ర, సూర్య కాస్కో - ప్రతీ నిమిషం, ప్రత్యేకతలెన్నో..!!

కొత్త చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఆదిత్య ఎల్ వన్ మిషన్ కు ఫైనల్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఇస్రో అడుగులు వేస్తుంది భారత తొలి సోలార్ మిషన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది యావత్ భారతదేశం ఈ మిషన్ ను ఉత్కంఠ గా ఎదురుచూస్తుంది.

ఇస్రో కొత్త చరిత్ర: యావత్ భారతదేశం మరోసారి ఇస్రోవైపు దృష్టి కేంద్రీకరించింది. చంద్రయాన్ ఇచ్చిన సక్సెస్ తో అంతరిక్షంలోనూ భారత్ కు సాటి లేదని నిరూపించిన ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. షార్ వేదిక నుంచి ఆదిత్య ఎల్ వన్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

 All set for Launch of Aditya -L1 from Sriharikota

నాలుగు నెలల పాటు ప్రయాణించి భూమికి సూర్యుడికి ఉన్న ఎల్ వన్ పాయింట్ ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలోకి భారత్ ఉపగ్రహం ప్రయోగం చేపట్టటం ఇదే తొలిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా సూర్యుణ్ణి నిరంతరం అధ్యయనం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఏడు పరిశోధన పరికరాలు ఉన్నాయి.

సూర్యుడిపై తొలి ప్రయోగం: సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్‌ ఇదే కావడం విశేషం. దీన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని సూర్యుడు- భూమి లాగ్రేంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అక్కడి చేరేందుకు సుమారు 125 రోజుల సమయం పడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు.

తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్ ఫియర్ క్రోమోస్ఫియర్ సహా వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఆదిత్య-ఎల్‌1 ద్వారా సూర్యుడు, నక్షత్రాలు, పాలపుంత గురించి కీలకమైన విషయాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇందులో మొత్తం ఏడు పే లోడ్లు ఉంటాయి. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుడిపై అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు ఎల్‌-1 పరిధిలోని వాతావరణంపై అధ్యయనం చేస్తాయి.

 All set for Launch of Aditya -L1 from Sriharikota

ప్రపంచం చూపు భారత్ వైపు: సౌర జ్వాలలు సౌర రేణువులు అక్కడి వాతావరణం గురించి అన్ని అంశాలను శోధిస్తాయి. ఈ అంతరిక్ష ఉపగ్రహంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సూర్యుడి పుట్టుక, తీరుతెన్నులు, సీఎంఈల గురించి అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. సూర్యుణ్ణి నిమిషానికోసారి పరిశీలిస్తూ కంట్రోల్ సెంటర్ కు సమాచారం అందించటం ఈ ఉపగ్రహ ప్రత్యేకత. ఎల్‌-1 పాయింట్‌ వద్ద ఈ శాటిలైట్‌ను ప్రవేశపెట్టడం వల్ల సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించవచ్చు.

సూర్యుడి నుంచి అంతరిక్షంలోకి వెలువడే పదార్థాలు కొన్నిసార్లు భూమివైపు దూసుకొస్తాయి. వీటి వల్ల శాటిలైట్లకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పాటు వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉంటే ముందే గుర్తించి వాటిని దారి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్ వన్ పై ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+