ఆళ్ళ రూటే సపరేటు.. రైల్లో సాధారణ బోగీలో సామాన్యుడిలా ప్రయాణం చేసిన ఎమ్మెల్యే ఆళ్ళ

మంగళగిరి నుండి ఎన్నికల బరిలోకి దిగి టీడీపీ నుండి పోటీ చేసిన మాజీ సీఎం చంద్రబాబు తనయుడు , ఐటీ మంత్రి నారా లోకేష్ పై విజయం సాధించిన ఆళ్ళ రూటే సపరేటు.. సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోవటం, ఇప్పటికీ ఒక రైతుగా వ్యవసాయం చెయ్యటం , తాను ఎమ్మెల్యే అని కించిత్తు గర్వం లేకుండా అతి సామాన్యంగా వ్యవహరించటం ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్పెషాలిటీ. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి కాబట్టే మంగళగిరి ప్రజలు మరోసారి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇక తాజాగా ఆళ్ళ రైలు ప్రయాణం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఎమ్మెల్యే అయినా సామ్న్యులకు చేరువలో సామ్న్యుడిగా ప్రవర్తించే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ

ఎమ్మెల్యే అయినా సామ్న్యులకు చేరువలో సామ్న్యుడిగా ప్రవర్తించే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ

నాయకుడంటే ఎలా ఉండాలి అంటే ఎప్పుడూ జనంలో ఉంటూ , జనంతో మమేకమవుతూ , జనం బాధలు తెలుసుకుని పరిష్కరించే వాడై ఉండాలి . సామన్యంగా జనాల్లో కలిసిపోతూ ఏ మాత్రం గర్వం లేకుండా ప్రవర్తించే వాడై ఉండాలి. అలాంటి నాయకుడే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి . మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుండి బరిలోకి దిగిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను కూడా కాదని ఆళ్ళకు జనం పట్టం కట్టటానికి ఆళ్ళ సింప్లిసిటీ నే కారణం . అందరి కష్టాలు తెలుసుకునే, అతి సామాన్యంగా వ్యవహరించే నాయకుడు కావటమే కారణం .

గతంలో చంద్రబాబు పాలనపై పోరాటం .. నేటికీ రైతుగా వ్యవసాయం

గతంలో చంద్రబాబు పాలనపై పోరాటం .. నేటికీ రైతుగా వ్యవసాయం

ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతి భూముల విషయంలో రైతుల పక్షాన పోరాడారు. హైకోర్టులో రైతుల పక్షాన పిటీషన్ వేసి టీడీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. కేసులతో చంద్రబాబును ఇరుకునపెట్టారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా ఇప్పటికీ ఆయన తన పొలంలో దుక్కిదున్ని వ్యవసాయం చేస్తున్నారు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి . ఇటీవల ఆయన వ్యవసాయం చేస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఎంతో సాధించినా, ఎమ్మెల్యే అయినా ఇంకా రైతు వలే పొలంలో పనిచేస్తూ సాధారణ జీవితం గడిపే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి త్వరలో మంత్రిగా అవకాశం దక్కబోతుందని టాక్.

పల్నాడు ఎక్స్ ప్రెస్ లో సాధారణ బోగీలో ప్రయాణించిన ఆళ్ళ .. సింప్లిసిటీ తో అందర్నీ ఫిదా చేస్తున్న ఆళ్ళ

పల్నాడు ఎక్స్ ప్రెస్ లో సాధారణ బోగీలో ప్రయాణించిన ఆళ్ళ .. సింప్లిసిటీ తో అందర్నీ ఫిదా చేస్తున్న ఆళ్ళ

ఆళ్ల ఇటీవల బేగంపేట నుంచి గుంటూరుకి పల్నాడ్ ఎక్స్ ప్రెస్ లో సాధారణ బోగిలో ప్రయాణించారు. ట్రైయిన్ లో ఆయనను గుర్తుపట్టిన ప్రయాణికులు ఆయనతో ఫోటో దిగడానికి ఎగబడ్డారు. ఎమ్మెల్యే అయ్యి కూడా సాధారణ పౌరుడిలా తమతో ప్రయాణించడం చూసి వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఫోటోలు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.ఆ రైల్లో దాదాపు 50మంది జగన్ ముఖ్యమంత్రి అయినందుకు మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి వెళ్తున్నవారు కావడం విశేషం. ఇక వారు ఈ విషయాన్ని ఆళ్లతో పంచుకున్నారట. జగన్ సీఎం కావాలని ప్రజలంతా కోరుకున్నారని... అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని ఈ సందర్భంగా ఆళ్ల అన్నారు.ప్రస్తుతం ఆయన ఫోటోలు చూసిన వారంతా ఎంతైనా ఆళ్ళ సింప్లిసిటీనే వేరప్పా అంటూ ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+