అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..!

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ సీఎం చంద్రబాబు చెప్తున్న మాటలు డొల్ల అని, ఇది రాష్ట్రానికి భవిష్యత్తులో గుదిబండగా మారబోతోందని వైఎస్సార్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. తాజాగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు అబద్దమని నిరూపించేలా అమరావతికి సంబంధించిన గణాంకాలను ఆయన ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబు మాటల ప్రకారమే లెక్కిస్తే అమరావతిలో ఏం జరగబోతోందో ఆయన కుండబద్దలు కొట్టారు.

అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందని, ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైయస్పార్‌సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు చెబుతున్న మాటలు అబద్ధాలని సజ్జల ఆరోపించారు. కాకి లెక్కలతో ప్రజలను నమ్మించబోయి, అడ్డంగా దొరికిపోయారన్నారు. ఆయన మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమేనన్నారు. ఇప్పుడు అక్కడ ఎకరం భూమి రూ.10 కోట్లు అని చెప్తుకుంటున్నారని, కానీ అక్కడ చంద్రబాబు ఇంటి కోసం కొన్న 5 ఎకరాల స్థలం ధర గజం రూ.7,500 అని, దస్తావేజుల ప్రకారమే లెక్క కడితే ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లే అన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అక్కడ గజం భూమి రూ.6 వేలే అన్నారు. ఆ లెక్క ప్రకారం ఎకరం భూమి రూ.2.91 కోట్లు ఉందన్నారు.

Amaravati a Debt Trap Sajjala Reddy Accuses Naidu of Imposing Nearly 2 Lakh Burden Per Citizen

అయినా చంద్రబాబు లెక్క ప్రకారం ఆయన కొన్నట్లు గజం రూ.7500 చొప్పున లెక్క వేసుకున్నా, ఆ ధర ప్రకారం 5 వేల ఎకరాలు అమ్మినా, ఎవరైనా కొంటానన్నా వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లే అన్నారు. అంతకు మించి పైసా రాదన్నారు. ఇంకా దానికి వడ్డీ లెక్కేయడం లేదన్నారు. అమరావతిలో ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్‌ల విలువ రూ.50 వేలకు కోట్లకు పైనే అని, ఇంకా అక్కడ కనీస మౌలిక సదుపాయాల కోసమే ఆయన చెబుతున్న ఖర్చు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున.. ఇప్పుడు సేకరించే దాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.2 లక్షల కోట్లు అన్నారు. కానీ ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అప్పు. ఇంకా తెచ్చేది కూడా అప్పు. దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుందన్నారు.

Amaravati a Debt Trap Sajjala Reddy Accuses Naidu of Imposing Nearly 2 Lakh Burden Per Citizen

పోనీ చంద్రబాబు అనుకున్నట్లు అభివృద్ధి చెందాక ఎకరం విలువ రూ.20 కోట్లు అవుతుందనుకుంటే..ఆ అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు, 15 ఏళ్లు పడుతుందని లోకేష్ అంటున్నారన్నారు. మరి అప్పటికి వడ్డీనే రూ.3 లక్షల కోట్లు అవుతుందా? లేక రూ.4 లక్షల కోట్లు అవుతుందా? నిజం చెప్పాలంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మీరు అప్పు చేయాల్సిందే కదా. మరి అలాంటప్పుడు ఆ అప్పు మీద వడ్డీ మాటేమిటి? అని ప్రశ్నించారు. మీకు సంపద సృష్టి కోసం అవి పనికి రావొచ్చని, కానీ రాష్ట్రం మీద పడే భారం మాటేమిటన్నారు. ఇప్పుడు ఈ విషయం మీకుచెప్పి కూడా లాభం లేదని, ఎందుకంటే ఈ లెక్కలు మీకు కూడా తెలుసని సజ్జల చంద్రబాబుకు తెలిపారు. ఇప్పుడు ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రజలే అన్నారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే, చంద్రబాబుగారి మార్క్‌ 'ఎండ మావి'జన్‌ కావాలా? అందులో పదో వంతు ఖర్చుతో-అదీ దశలవారీగా-రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్ మార్క్‌ గ్రోత్‌ ఇంజన్‌ 'మావిగన్‌' కావాలా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+