అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ విప్ పిన్నెళ్లి కారుపై రాళ్ల దాడి: ఎమ్మెల్యే మీదకు తోసుకెళ్లిన రైతులు: ఉద్రిక్తత..!

|
Google Oneindia TeluguNews

అమరావతి ఉద్యమ కారులు వైసీపీ విప్ కారు పైన దాడి చేసారు. విప్..మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి వాహనంపై రాళ్లు రువ్వారు. చినకాకాని వద్ద భారీగా రైతుల రాస్తారోకో నిర్వహించారు. దీంతో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై రెండు గంటలపాటు ట్రాఫిక్‌ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. రోడ్డుకిరువైపులా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయం లో అటుగా వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఆ తరువాత అటుగా వచ్చిన పిన్నెళ్లిని కారు ఆపాలంటూ నిరసనకారులు డిమాండ్ చేసారు. వాహనం ఆపకపోవటంతో ఆయన కారు పైన రాళ్లతో దాడి చేసారు. ట్రాఫిక్ లో ఆయన కారు చిక్కుకుపోయింది. కారు ముందు బైఠాయించి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేసారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.

వైసీపీ విప్ కారుపైన రాళ్లతో దాడి..
చినకాకాని వద్ద వైసీపీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కారు పైన అమరావతి ఉద్యమ కారులు దాడికి దిగారు. రాజధాని తరలింపు నిరిస్తూ ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలు..రైతులు జాతీయ రహదారి దిగ్బంధనానికి దిగారు. దీంతో..ఉదయం నుండి కృష్ణా..గుంటూరు జిల్లాకు చెందని పలువురు జేఏసీ నేతలు..టీడీపీ..వామపక్ష నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఇక, జాతీయ రహదారి దిగ్బంధనం చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన విప్ పిన్నెళ్లి కారును అడ్డుకొని కారుకు అడ్డంగా పడుకున్నారు. కారు ముందు బైఠాయించి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేసారు. పెద్ద ఎత్తున రైతులు కారును చుట్టి ముట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పిన్నెళ్లి కారులోనే ఉన్నారు. అమరావతికి మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఆ సమయంలో కొందరు పిన్నెళ్లి కారు పైన రాళ్లు రువ్వారు. దీంతో..ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అడ్డుకొనే ప్రయత్నం చేసిన పిన్నెల్లి గన్ మెన్ల పైన ఉద్యమకారులు దాడికి దిగారు.

Amaravati Agitators thrown stones on Whip Pinnelli car tried to attack him

మంత్రి సురేష్ సైతం దిగ్బంధనం..
అదే రూట్లో వస్తున్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కారు సైతం ఈ దిగ్బంధనం లో చిక్కుకుపోయింది. పోలీసులు కష్ట పడి మంత్రి కారును ముందుకు పంపించారు. ఇక, ఆ తరువాత చినకాకాని మీదుగా వెళ్తున్న పిన్నెళ్లి కారు ను రైతులు ముట్డడించారు. తాము 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా..మద్దతివ్వారా అని ప్రశ్నించారు. ఒక సమయంలో ఎమ్మెల్యే మీదకు దూసుకెళ్లే ప్రయత్నం చేసారు. దీంతో..పోలీసులు రంగ ప్రేశం చేసి అక్కడి వారిని చెదర గొట్టారు. పిన్నెళ్లి కారు ముందుకు కదలటంతో ఆయన కారుకు అడ్డంగా మరో కారును అడ్డుగా పెట్టారు. పెద్ద సంఖ్యలో ఉద్యమ కారులు అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత కొద్ది సేపటికి పోలీసులు అక్కడి నుండి ఎమ్మెల్యే కారును ముందుకు పంపించారు.

English summary
Amaravati protests creating tension situation in national High way. YCP whip Pinnelli Rama Krishna Reddy car attacked by farmers. Thrown stones on Whip car..attacked his gun mens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X