Amaravati:అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ -గెజిట్ తర్వాత మారిన భూమి లెక్కలు..!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న సుదీర్ఘ ఉత్కంఠకు చివరకు తెరపడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన "ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026"పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభించింది.

పెరిగిన భూమి ధరలు

ఈ చారిత్రాత్మక నిర్ణయం రాజధాని ప్రాంత రియల్ ఎస్టేట్ మార్కెట్‌ ఉవ్వెత్తున పైకి లేచింది. గెజిట్ విడుదలైన గంటల్లోనే రాజధాని ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఏడాది కాలంలో చూస్తే ఒక చదరపు గజం ధర రూ.10 వేల నుంచి రూ.40-50 వేలకు చేరింది.మెట్ట ప్రాంతంలో గతేడాది భూమి ధర గజం రూ.20-25 వేలు వరకు ఉండగా, ఇప్పుడు రూ.35-40 వేలకు పెరిగింది. రాజధాని సమీపంలోని మండలాల్లో కూడా పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయి. ఈ పెరుగుదలతో సామాన్యులకు స్థలాల కొనుగోలు భారంగా మారుతోంది.

amaravati-real-estate-boom-land-prices-surge-after-ap-capital-gazette-notification

భవిష్యత్తులో ఎలా ఉంటుంది..?

రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం అమరావతిలో రియల్ బూమ్ హైదరాబాద్ కంటే రెండింతలు ఉండబోతోంది.ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోనే కాకుండా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, బాపట్ల వరకు ధరలు భారీగా పెరుగుతున్నాయి.అమరావతిలో 15 బ్యాంకుల ఆఫీసుల భవనాలతోపాటు SRM, VIT యూనివర్సిటీలు విస్తరించే పనిలో పడ్డాయి.

BITS క్యాంపస్,XLRI,నేషనల్ లా యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు నిర్మాణాలు ప్రారంభించాయి.త్వరలోనే ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణం ఏకకాలంలో జరగనుంది.దీంతో ఉపాధి కోసం వచ్చేవారు పెరుగుతారు. ఈ గెజిట్ నోటిఫికేషన్‌తో పెట్టుబడిదారులలో విశ్వాసం పెరగడంతో పాటు రాజధాని ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అందరిలోను కనిపిస్తోంది.

సీఆర్డీఏ పరిధిలో మధ్య తరగతికి అందుబాటులో ఇంటి ప్లాట్లు ఇప్పటికీ లభిస్తున్నాయి. రాజధాని అభివృద్ధిలో క్రమ పద్ధతిలో ముందుకు వెళుతుండటంతో భవిష్యత్తులో అందిరికీ ఇక్కడ స్థలాలు ఆమోదయోగ్యంగా మారుతాయని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి ఇటువంటి చట్టబద్ధత ఇంతవరకూ లేదు .ఈ ప్రత్యేకత అమరావతికే దక్కింది.ఇప్పుడు పెట్టుబడులకు భరోసా ఉంది.అభివృద్ధికి వేగం ఉంది.అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఎదిగే అవకాశం దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+