యాపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఫోన్ లేనిదే క్షణం కూడా గడవడంలేదు. యాపిల్ ఫోన్లు అంటే పిచ్చ క్రేజ్. యాపిల్ ఫోన్లలో వచ్చే ఫీచర్లతో పాటు సెక్యూరిటీ పరంగా ఆ ఫోన్లపై అందరూ మక్కువ చూపుతుంటారు. మనదగ్గర కూడా యాపిల్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఇతర ఫోన్లతో పోల్చుకుంటే ధరలు విపరీతంగా ఉంటాయి. ప్రత్యేకంగా అమ్మకాలున్న సమయంలో చాలామంది యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చూస్తారు.
యాపిల్ ప్రొడక్ట్ లవర్స్ కోసం.. యాపిల్ సంస్థ అమెజాన్ భాగస్వామ్యంతో అమ్మకాలను ప్రారంభించింది. అమెజాన్ యాపిల్ డేస్ (Amazon Apple Days 2023) పేరుతో నిర్వహిస్తున్న ఈ అమ్మకాల్లో యాపిల్ లేటెస్ట్ మోడల్ ఫోన్లపై భారీ తగ్గింపులను ఇస్తోంది. ముఖ్యంగా iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. ఈ సేల్ జూన్ 17 వరకూ కొనసాగుతుంది. ఐఫోన్ ప్రేమికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

అమెజాన్ తాజాగా తన వినియోగదారులకు శుభవార్తను వినిపించింది. అమెజాన్ ప్రైమ్ లైట్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సబ్‌స్క్రిప్షన్ ఒకప్పుడు రూ.999కే లభించేది. ఇప్పుడు రూ.1499కి పెంచారు. పెరిగిన ధర వల్ల వినియోగదారులు ముందుకు రావడంలేదు. అంతేకాదు రెన్యువల్ చేసుకోవడానికి కూడా పూర్తి విముఖత చూపిస్తున్నారు. దీంతో వినియోగదారులను పెంచుకునేందుకు అమెజాన్ కొత్తగా లైట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.999. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌లో ప్రకటనలుంటాయి. ప్రైమ్ వీడియోలో అయితే ఎటువంటి ప్రకటనలు ఉండవు. అమెజాన్ కూడా నెట్‌ఫ్లిక్స్ దారిలోనే పయనిస్తోంది.












Click it and Unblock the Notifications