టీషర్టు మీద చేగువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను? వారాహి యాత్ర వేళ అంబటి ట్వీట్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలు రసవత్తరంగా మారుస్తున్నారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ వైసిపి పాలనను టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి సర్కారు వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటే, మరో ప్రక్క పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి బయలుదేరాడు.

పవన్ కళ్యాణ్ ను సైతం టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడంలో అంబటి రాంబాబుది ప్రత్యేకమైన శైలి. తాజాగా మంత్రి అంబటి రాంబాబు పవన్ గురించి పరోక్షంగా ట్వీట్ చేశారు. చేగువేరా జన్మదినం సందర్భంగా ఒక ప్రశ్న.. టీ షర్టు మీద చేగువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

varahi ambati rambabu

నేడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్ర ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. టీ షర్ట్ మీద చేగువేరా అని ఉంటుందని.. కానీ గుండెల్లో మాత్రం చంద్రబాబు ఉంటాడు.. ఎవరు అతను వేసిన ప్రశ్నకు నెటిజన్ల నుండి వింత వింత సమాధానాలు వస్తున్నాయి.

కొందరు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి సమాధానాలు చెబుతుంటే, మరికొందరు మంత్రి అంబటి రాంబాబుకి సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ మీనమేషాలు లెక్క పెట్టుకొని వ్యాన్ తీసుకొని బయలుదేరారని పేర్కొన్నారు.

varahi ambati rambabu

చంద్రబాబు డైరెక్షన్లో యాంటీ వైసిపి ఓటు చీలకూడదు అంటున్నాడని, గత రెండు ఎన్నికల్లో చంద్రబాబును మోసిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో కూడా చంద్రబాబునే మోయడానికి రెడీ అయ్యాడని విమర్శించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపధ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+