గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఆర్డీఏ పరిధిలో మరో అధికారిణిపై సస్పెన్షన్ వేటు: ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజధాని ప్రాంతంలోో మరో అధికారిణిపై సస్పెన్షన్ వేటు పడింది. అమరావతి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆమె పేరు పావులూరి ఉమాదేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ ఉత్తర్వులను జారీ చేశారు.

వైఎస్ జగన్ బెస్ట్ ఫ్రెండ్, తమిళ నటుడు సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ: తర తమ భేదాల్లేవ్వైఎస్ జగన్ బెస్ట్ ఫ్రెండ్, తమిళ నటుడు సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ: తర తమ భేదాల్లేవ్

ముఖ్యమంత్రిని కించపరిచేలా, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేయడం వైరల్‌గా మారాయి. దీన్ని నిరసిస్తూ ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర నాయకులు ఓ సారి ఆమె కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆమెపై శాఖాపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫలితంగా పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కిందటి నెల ఆమెను ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారు. విచారణకు ఆదేశించారు.

 Amravati MPDO suspended after criticising against AP Government YS Jagan

విచారణాధికారిగా ఆర్డీఓను నియమించారు. విచారణకు ఉమాదేవి సరిగ్గా హాజరు కావట్లేదని, పిలిచినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆర్డీఓ నివేదిక ఇచ్చారు. దీనితో ఆమెను కలెక్టర్ సస్పెండ్‌ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తన మండల పరిధిలోని గ్రామాల్లో దుకాణాలను తెరవడానికి వీలుగా ఉమాదేవి చర్యలు తీసుకున్నారని, అనధికారికంగా ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆర్డీఓ విచారణలో తేలింది.

Recommended Video

Temples, Malls Restaurants Will Open In Andhra Pradesh From June 8

ముఖ్యమంత్రిపై, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేసి సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఇదివరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కమ్)లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసిన ఓ మహిళా ఉద్యోగిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఆమె తన ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లల్లో తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్లే చర్యలు తీసుకున్నారు.

English summary
Amaravati Mandal Parishad Development Officer suspended after anti comments on Chief Minister YS Jagan Mohan Reddy and criticising to Welfare schemes, which is implemented by the Government of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X