ఇప్పుడే ప్రయాణం ప్రారంభమైంది.. లోకేష్ ట్వీట్ కు ఆసక్తికర సమాధానమిచ్చిన ఆనంద్ మహీంద్రా!
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారు అనే విషయం ప్రతిఒక్కరికి తెలిసిందే. ఆయన సోషల్ మీడియాలో చాలా సృజనాత్మకమైన ఆసక్తికరమైన వీడియోలను పెట్టి తనదైన శైలిలో చెబుతూ ఉంటారు. మంచి గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తుల గురించి తరచూ పోస్టు పెడుతుంటారు. ఇవి మాత్రమే కాకుండా తన కంపెనీకి సంబంధించిన అనేక పురోగతి విషయాలను పంచుకుంటూ అభిమానులకు తమ కంపెనీ చేస్తున్నది వివరిస్తూ ఉంటారు
ఆనంద్ మహీంద్ర పోస్టుకు స్పందించిన మంత్రి నారా లోకేష్
ఈ క్రమంలో ఆయన తాజాగా ప్యూరియో ట్రక్కుకు సంబంధించిన తెలుగు ప్రకటనను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. "ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంటుంది. ట్రక్కును సొంతం చేసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి" అంటూ ఆయన దానికి క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ వీడియో చూసి స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్, ఆ యాడ్ చాలా బాగుందని పేర్కొన్నారు.

మహీంద్రాకంపెనీకి స్వాగతం పలికిన లోకేష్
ఇది తెలుగు ప్రజలకు తప్పకుండా నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహేంద్ర కంపెనీని ఎందుకు ఏర్పాటు చేయకూడదని ఆయన ఈ పోస్టును చూసి ప్రశ్నించారు. మహీంద్రా కంపెనీకి ఆతిథ్యం ఇవ్వడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని లోకేష్ తెలియజేశారు.
లోకేష్ స్పందనపై ఆనంద్ మహీంద్రా ప్రతిస్పందన
ఇక తను పెట్టిన వీడియో పై స్పందించిన లోకేష్ స్పందనకు ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడం తమకు గర్వకారణంగా ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. పర్యాటకం, సూక్ష్మ నీటిపారుదల, సోలార్ విద్యుత్ వంటి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టే అంశంపై తమ బృందం ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు.
ధన్యవాదాలు! ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయి.
— anand mahindra (@anandmahindra) July 19, 2025
We would be proud to be a partner in Andhra Pradesh's journey.
Our teams are already in discussions across multiple sectors, from solar energy to micro-irrigation and of course, tourism.
మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది...ముందు… https://t.co/jdRiAr8o7w
ఏపీ ప్రజల్లో ఆనంద్ మహీంద్రా పోస్ట్ తో హర్షం
ఆంధ్రప్రదేశ్‌తో తమ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, ముందు ఇంకా చాలా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు ఏపీ ప్రజలకు సంతోషం కలిగిస్తుంది.ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు
ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ నుండి సూక్ష్మ నీటిపారుదల వరకు అనేక రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని, దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన చెప్పడంతో చాలామంది ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications