ఆనందయ్య మరో ట్విస్ట్- సర్కార్ సహకరించకపోతే సొంత ట్రస్టుతో- సాయంత్రం నిర్ణయం
నెల్లూరు ఆనందయ్య కరోనా మందు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో పంపిణీ చేసే విషయంలో సందిగ్ధత నెలకొంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మందు పంపిణీ చేసిన ఆనందయ్య.. స్ధానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు కూడా సరఫరా చేశారు. కానీ ప్రభుత్వం నుంచి సహకారం లభించకపోవడంతో ఇతర ప్రాంతాలకు మందు సరఫరా విషయంలో ఆయన కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్ధితి.
Recommended Video
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మందు పంపిణీలో సహకారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 7న లేఖ రాసిన అనందయ్య.. ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం వరకూ ఎదురుచూశాక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోతే మందు తదుపరి పంపిణీపై తన స్పందన ప్రకటిస్తానని ఆనందయ్య తెలిపారు. తాను తయారు చేస్తున్న కరోనా మందును ఇంటింటికి పంపిణీ చేయాలంటే ప్రభుత్వ సహకారం చాలా అవసరమన్నారు.

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఇంటింటికీ మందు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆనందయ్య కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో విమర్శలు వస్తాయోమో అన్న ఆలోచనతో ముందూ వెనుకా ఆలోచిస్తోంది. దీంతో అటు ఆనందయ్యలో కూడా అసహనం పెరుగుతోంది. ప్రభుత్వం సహకరించకపోతే తన సొంత ట్రస్టు సాయంతో రాష్టవ్యాప్తంగా పంపిణీకి చర్యలు తీసుకుంటానని ఆనందయ్య చెప్తున్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారీ సాగుతోంది. కృష్ణపట్నంలో ఇప్పటివరకూ మందు పంపిణీ పూర్తయిందని, ఇప్పటికిప్పుడు 50 వేల మంది పాజిటివ్ రోగులు వచ్చినా సరఫరా చేసే విధంగా మందు సిద్ధం చేశామని ఆనందయ్య తెలిపారు. కరోనా రాని వారి కోసం మందు తయారు చేయాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications