ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. CRDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు ప్రకటించింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పర్యవేక్షణ, టెక్నికల్ సపోర్ట్ కోసం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 132 కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ ప్రకటించారు.
భర్తీ చేయబోయే పోస్టులు..
ఇంజనీరింగ్ విభాగం..
- చీఫ్ ఇంజినీర్ - 4 పోస్టులు
- సూపరింటెండింగ్ ఇంజినీర్ - 8 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - 15 పోస్టులు
- డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - 25 పోస్టులు
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్/అసిస్టెంట్ ఇంజినీర్ - 50 పోస్టులు

ఫైర్ సేఫ్టీ విభాగం..
- సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ - 2 పోస్టులు
- జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ - 4 పోస్టులు
ఎలక్ట్రికల్ & ELU విభాగం..
- సీనియర్ ఎలక్ట్రికల్/ELU ఎక్స్‌పర్ట్ - 2 పోస్టులు
- జూనియర్ ఎలక్ట్రికల్/ELU ఎక్స్‌పర్ట్ - 6 పోస్టులు
ప్లంబింగ్ విభాగం..
- సీనియర్ ప్లంబింగ్ ఎక్స్‌పర్ట్ - 2 పోస్టులు
- జూనియర్ ప్లంబింగ్ ఎక్స్‌పర్ట్ - 6 పోస్టులు
HVAC విభాగం..
- సీనియర్ HVAC ఎక్స్‌పర్ట్ - 2 పోస్టులు
- జూనియర్ HVAC ఎక్స్‌పర్ట్ - 6 పోస్టులు
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఎంపిక విధానం..
ఎంపిక ఇంటర్వ్యూ/మెరిట్ బేస్ ఆధారంగా జరగనుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం జరుగుతుందని, పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్‌ను పొడిగించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
జీతం..
పోస్టుల ప్రకారం జీతభత్యాలు నిర్ణయించబడతాయి. సీనియర్ పోస్టులకు అధిక ప్యాకేజీలు, జూనియర్ స్థాయి ఉద్యోగులకు మార్కెట్ ఆధారంగా స్పర్థాత్మక జీతాలు అందించనున్నారు. సీఆర్‌డీఏలో పనిచేయడం ద్వారా రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు.
దరఖాస్తు విధానం..
ఆసక్తి గల అభ్యర్థులు ఏపీ సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్లోని కెరీర్స్ సెక్షన్‌ను సందర్శించి, నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు, అనుభవం, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫీజు వంటి వివరాలు కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications