అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని నిర్మాణం: ఏపీ సర్కార్ ముందడుగు, స్విస్ ఛాలెంజ్‌‌కు నోటిఫికేషన్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. స్విస్ ఛాలెంజ్ విధానంలోనే నవ్వాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం స్విస్ ఛాలెంజ్ బిడ్డింగ్‌లకు సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.

సోమవారం నుంచి నుంచి సెప్టెంబర్‌ 1 వరకు సీఆర్డీఏ బిడ్లను స్వీకరించనుంది. రాజధాని ప్రాంతమైన సుమారు 6.84 చదరపు కిలోమీటర్లలో అమరావతి నిర్మాణానికి బిడ్డింగ్‌ను వెల్లడించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్‌ పద్ధతిలో నిర్మించాలని ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

తాజాగా స్విస్ ఛాలెంజ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇతర సంస్థల నుంచి కౌంటర్ ఛాలెంజ్‌ను కోరాల్సి ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో భాగంగా సింగపూర్‌ సంస్థల కన్సార్టియం దాఖలుచేసిన ప్రతిపాదనలకు ఇతర సంస్థల నుంచి ఛాలెంజ్‌లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.

Andhra Pradesh govt release notification for swiss challenge model to develop amaravati

ఇందులో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న పల్లోంజి, ఎల్‌ అండ్‌ టి సంస్థలు కీలక రాజధాని నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు జెపి కన్‌స్ట్రక్షన్స్‌, గంగవరం, మచిలీపట్నం వంటి కీలక పోర్టుల నిర్మాణంలో పాత్రధారులుగా ఉన్న ఇతర సంస్థలు కూడా ఛాలెంజ్‌ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

సింగపూర్ ప్రతిపాదనను బహిర్గతం చేసిన తర్వాత మిగతా సంస్ధలకు దానిని ఛాలెంజ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 45రోజుల గడువు ఇచ్చింది. ఈ క్రమంలో సింగపూర్ కంపెనీల కన్సార్షియం కన్నా తక్కువకు నిర్మాణం పూర్తిచేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే, అదే మొత్తానికి సింగపూర్‌ అరగీకరిస్తే ఆ సంస్థకే టెండర్‌ ఖరారవుతుంది.

లేకుంటే తక్కువ మొత్తానికి ప్రతిపాదించిన సంస్థకు టెండర్‌ లభిస్తుంది.
మరోవైపు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కోసం అటవీ భూములను కేటాయించాలన్న ఏపీ ప్రతిపాదనపై కేంద్ర పర్యవారణ శాఖ సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేంద్రంతో జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

తొలిదశలో భాగంగా ఏడు వేల ఎకరాల మేర అటవీ భూముల కేటాయింపునకు అనుమతి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. కనీసం 32 వేల ఎకరాల అటవీ భూమిని తమకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై అటవీ శాఖ సలహా మండలి పలు అభ్యంతరాలు, సందేహాలను లేవనెత్తింది.

సీఆర్డీఏ పరిధిలో 407.96 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రదేశం ఉందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. దీంతో తొలి దశలో భాగంగా ఏడు వేల ఎకరాల అటవీ భూములను కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉండటంతో కడప, ప్రకాశం జిల్లాలో అడవులు పెంచడానికి అవసరమైన కసరత్తు త్వరలో ప్రారంభం కానుంది.

English summary
Andhra Pradesh chief minister Chandrababu Naidu said the Singapore consortium has offered a 42% stake to Amaravati Development Company (ADC), a special purpose vehicle floated by the state government, under Swiss Challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X