ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలకవ్యాఖ్యలు చేసింది. దశాబ్దాలుగా తక్కువ వేతనాలతో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయించుకోవడం శ్రమదోపిడి అని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ సుబేంధుసామంతతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

ఉద్యోగులను రెండు నెలల్లోగా క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలలో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన పోస్టుల్లోనూ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపడుతోందని కోర్టు గమనించింది. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటూ, వారిని రోజువారీ వేతన జీవులుగా ఉంచడం సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో, పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగులను రెండు నెలల్లోగా క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది.

AndhraPradesh High Court verdict regarding the regularization of contract and outsourced employees

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు

అంతేకాకుండా, పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించడాన్ని నిరాకరిస్తూ గతంలో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సైతం హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.ఇలాంటి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ ఆదర్శవంతమైన యజమానిగా వ్యవహరించాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. అర్హతలు ఉన్న వారిని, తక్కువ వేతనాలకు అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

తమను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్

సాంకేతిక కారణాలు, నియామకాలు సక్రమంగా జరగలేదని చెప్పే సాకులు, హక్కులను నిరాకరించడానికి తగవని స్పష్టం చేసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో టైపిస్టులు, వాచ్మెన్ లు, గార్డినర్ లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్ లు, డ్రైవర్లు వంటి పలు ఉద్యోగులు, తెలుగుగంగ ప్రాజెక్టు కోసం పనిచేసిన ఉద్యోగులు కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తాము పని చేస్తున్నామని తమను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.

హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు

ఈ పిటిషన్లను విచారించిన ఏపీఏటి, పిటిషనర్లు క్రమబద్ధీకరణకు అర్హులు కారని తీర్పు ను ఇచ్చి ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో వారు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఇక ఈ తీర్పుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+