AP Panchayat Elections: నేటి నుంచే నామినేషన్లు... తొలి విడతలో ఎన్నికలు జరిగే మండలాల జాబితా ఇదే...
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం(జనవరి 29) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. . ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై అభ్యంతరాలను పరిశీలన, ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
తొలి విడతలో మొత్తం 12 జిల్లాల్లో దాదాపు 175 మండలాల్లోని 3,249 పంచాయతీలకు, వాటి పరిధిలోని 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ వరకూ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 7గంటల లోపు ఫలితాలను వెల్లడిస్తారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లలో అన్ని మండలాలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించట్లేదు. ఒక్కో డివిజన్‌లోని కొన్ని మండలాలకు వేర్వేరు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలి విడత ఎన్నికలు జరగనున్న మండలాల జాబితా :
అనంతపురం జిల్లా: కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి.కుంట, నల్లమడ, ఓదులదేవర చెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్లు మండలాలు
చిత్తూరు జిల్లా: చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న బంగారుపాళ్యం, చిత్తూరు, గంగాధర నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, అర్.సీ.పురం, ఎస్.ఆర్ పురం, తవణంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి మండలాలు
తూర్పు గోదావరి జిల్లా: కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండగి, తుని, ఏలేశ్వరం మండలాలు
గుంటూరు జిల్లా: తెనాలి రెవెన్యూ డివిజన్ లోని అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వీ పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు మండలాలు
కడప జిల్లా: జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పారుమామిళ్ల, ఎస్.ఎ.కే.ఎన్ పాడు, కలసపాడు, బి.మఠం మండలాలు
కృష్ణాజిల్లా: విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు, పెనమలూరు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ రూరల్ మండలాలు
కర్నూలు జిల్లా: నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు మండలాలు
నెల్లూరు : జిల్లా: కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లూరు, బోగోలు, దగదర్తి, దత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు మండలాలు
ప్రకాశం జిల్లా: ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులరు, కారంచేడు, కొరిశపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్.జీ పాడు, ఒంగోలు, పర్చూరు, సంతమాగులూరు, సంతనూతలపాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాలు
శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు
Recommended Video
విశాఖపట్నం జిల్లా: అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం












Click it and Unblock the Notifications