Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ నిర్ణయంపై ఉత్కంఠ- వారం రోజులే గడువు- రాజధాని మార్పు నేపథ్యం.......

ఏపీలో రాజధాని మార్పు నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అమరావతి కేంద్రంగా పనిచేసిన పలు ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ప్రాంతాలకు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ఐదు పని దినాల ఆప్షన్ ను కూడా ప్రభుత్వం సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు సర్కార్ హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని మార్పు సందర్భంగా ఇచ్చిన ఈ ఆప్షన్ ను ఇప్పటికే ఓసారి పొడిగించిన జగన్ సర్కార్ ఈసారి ఏం చేయబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది.

ఐదు పని దినాల ఆప్షన్.....

ఐదు పని దినాల ఆప్షన్.....

2015లో హైదరాబాద్ నుంచి ఆకస్మికంగా రాజధాని అమరావతికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉద్యోగులను ఉన్నపళంగా అక్కడి నుంచి రమ్మని కోరే పరిస్దితుల్లో అప్పట్లో చంద్రబాబు సర్కార్ లేదు. దీంతో వారికి ఐదు రోజుల పాటు మాత్రమే పని దినాలు ఉండేటట్లు అవకాశం కల్పించారు. వారం ప్రారంభంలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చే సచివాలయ, హెచ్ వోడీ కార్యాలయాల ఉద్యోగులు తిరిగి వారాంతంలో హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయే వారు. జగన్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత కూడా ఏడాది పాటు ఈ ఆప్షన్ పొడిగించారు.

 కుంటుపడిన కార్యకలాపాలు..

కుంటుపడిన కార్యకలాపాలు..

రాష్ట్ర ప్రభుత్వ స్ధాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండే సచివాలయంతో పాటు అమరావతిలోని హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అప్పటి పరిస్ధితుల ఆధారంగా ఐదు రోజుల పనిదినాలు కల్పించారు. అయితే ఇది కాస్తా పదే పదే పొడిగింపులకు దారితీయడంతో ప్రభుత్వ కార్యకలాపాలు నత్తనడకన సాగుతున్నాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి 11 గంటలకు విధుల్లోకి వస్తున్న ఉద్యోగులు.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సచివాలయం నుంచి మాయమైపోతున్నారు. దీంతో ఐదు రోజుల పని కాస్తా నాలుగు, నాలుగున్నర రోజులకు తగ్గిపోతోంది. దీంతో పెండింగ్ ఫైళ్లు కూడా పెరిగిపోతున్నాయి. వీటి ప్రభావం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై, ఉద్యోగులపై, జనంపై కూడా పడుతోంది.

 ముగుస్తున్న గడువు...

ముగుస్తున్న గడువు...

గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఐదు పని దినాల ఆప్షన్ ను ఏడాది పాటు పొడిగించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తికాకపోవడం, ఇలాంటి కీలకమైన అంశంపై వెంటనే సమీక్షించి నిర్ణయాలు తీసుకునే పరిస్ధితి లేకపోవడంతో ఏడాద పాటు పొడిగింపు ఇచ్చారు. కానీ ఈ ఏడాదిలో పాలనా వేగం పెరిగింది. ప్రభుత్వం పదుల సంఖ్యలోసంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. రెవెన్యూ లోటు ఉండనే ఉంది. దీంతో పాలనను పరుగులు తీయించక తప్పని పరిస్ధితి ప్రభుత్వానిది. గతేడాది ప్రభుత్వం పొడిగించిన ఐదు పని దినాల గడువు ఈ నెల 27తో ముగిసిపోనుంది. దీంతో ప్రభుత్వం దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి.

Recommended Video

    Lockdown In AP : Ongole లో ఎల్లుండి నుంచి 14 రోజులు Lockdown అమలు !
    రాజధాని మార్పు ప్రభావం- జగన్ నిర్ణయం..

    రాజధాని మార్పు ప్రభావం- జగన్ నిర్ణయం..

    గతంలో హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతికి రావాలంటే కేవలం నాలుగు గంటల ప్రయాణంతో సరిపోయేది. కానీ రాజధాని మార్పుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ నుంచి విశాఖకు రావాలంటే కనీసం 8 నుంచి 9 గంటల ప్రయాణం తప్పనిసరి. దీంతో గతంలోలా ఐదు పనిదినాల పేరుతో ఉద్యోగులు అమరావతికి వచ్చినట్లు విశాఖకు రావడం సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం వీటిని రద్దు చేసే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఉద్యోగుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, ఇప్పటికిప్పుడు రాజధాని మార్పు లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మరో ఏడాది పొడిగింపు ఇచ్చినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+