తమిళనాడుకు గట్టి షాక్.. ఆంధ్రప్రదేశ్‌కు జై కొట్టిన దిగ్గజ కంపెనీలు

గ్లోబల్ తయారీ రంగాన్ని తమవైపు తిప్పుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరులో ఆంధ్రప్రదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రముఖ కార్ల తయారీ దిగ్గజాలు హ్యుండాయ్, కియా సంస్థలకు విడిభాగాలను సరఫరా చేసే కొరియాకు చెందిన మూడు దిగ్గజ ఆటోమోటివ్ సంస్థలు తమిళనాడును కాదని ఆంధ్రప్రదేశ్‌ను తమ పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నాయి. భారీ పారిశ్రామిక క్లస్టర్‌ను సృష్టించే దిశగా అనంతపురం జిల్లాలో మొత్తం రూ.1,614 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీలు సమ్మతించాయి.

ఏపీ వైపు మొగ్గు చూపిన మూడు కొరియన్ దిగ్గజాలు

ఈ మెగా ప్రాజెక్టుల ద్వారా అనంతపురంలో కొత్తగా 1,418 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల (MoUs) ప్రకారం.. 'హ్వాషిన్' (Hwashin) సంస్థ రూ.850 కోట్ల పెట్టుబడితో 100 మందికి, 'సెయోన్' (Seoyon) సంస్థ రూ.514 కోట్లతో 918 మందికి, 'ఇవామెట్' (Iwamet) కంపెనీ రూ.250 కోట్ల పెట్టుబడితో 400 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. తమిళనాడులో ముందస్తు కార్యకలాపాలు ఉన్నప్పటికీ, ఏపీలోని పారిశ్రామిక అనుకూల వాతావరణమే తమను ఇటువైపు నడిపించిందని ఆయా ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Andhra Pradesh Wins Rs 1614 Crore Korean Investment Beat Tamil Nadu in Major Automotive Win
రాయలసీమ దశ తిరిగేలా పెట్టుబడుల వెల్లువ.. రూ.5,217 కోట్ల 23 ఒప్పందాలు!
రాయలసీమ దశ తిరిగేలా పెట్టుబడుల వెల్లువ.. రూ.5,217 కోట్ల 23 ఒప్పందాలు!

దక్షిణ కొరియా పర్యటనతో మారిన సమీకరణాలు

గత జులై నెలలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన దక్షిణ కొరియా పర్యటనే ఈ భారీ పెట్టుబడులకు పునాది వేసింది. ఆ పర్యటనలో హ్యుండాయ్, కియా సప్లై చెయిన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలతో మంత్రి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మూడు కంపెనీలు పాల్గొన్నాయి. ఆ తర్వాత ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB) నిరంతరం అనుసరించిన వ్యూహాత్మక చర్యలు, క్రమం తప్పకుండా జరిపిన చర్చలు.. ఒప్పందాలుగా మారేలా చేశాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని మంత్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.

వైజాగ్‌కు దిగ్గజ సంస్థలు - డెలాయిట్ సహా, కీలక ఒప్పందాలు..!!
వైజాగ్‌కు దిగ్గజ సంస్థలు - డెలాయిట్ సహా, కీలక ఒప్పందాలు..!!

తమిళనాడుకు గట్టి షాక్.. గ్లోబల్ రేసులో ఏపీ గర్జన!

మరోవైపు, ఈ పరిణామం తమిళనాడు పారిశ్రామిక రంగానికి పెద్ద ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. ఆ రాష్ట్రం ఇప్పటికే కొరియన్ డెస్క్‌ను ఏర్పాటు చేసి, ఈ కంపెనీలతో సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ, వాటిని తమ వద్దే నిలుపుకోవడంలో విఫలమైంది. చురుకైన రాజకీయ దౌత్యం, అనుకూల పారిశ్రామిక విధానాలతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుండటంతో అనంతపురం జిల్లా త్వరలోనే దేశంలోనే అగ్రగామి ఆటోమోటివ్ హబ్‌గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+