ఉద్యోగార్ధులకు ఏపీ సర్కార్ శుభవార్త- మరో ఏడాది పాటు - వీటికే వర్తింపు...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి జగన్ సర్కారు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో సర్కారీ కొలువుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది యువతకు మేలు చేసేలా గతంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు నిరుద్యోగిత సమస్యకు కొంత మేర పరిష్కారం లభించనుంది.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న వయో పరిమితిని 42 సంవత్సరాలకు పొడిగిస్తూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని జగన్ సర్కార్ మరోసారి పొడిగించింది. సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం 2021 సెప్టెంబర్ 30 వరకూ రాష్ట్రంలో నిరుద్యోగులు 42 ఏళ్ల వయోపరిమితి వచ్చే వరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ గడువు 2019 సెప్టెంబర్ 30తోనే ముగిసింది.

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాల్లో గడువు పెంపును వర్తింప చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వయోపరిమితిని 42 ఏళ్లకి పెంచడం ద్వారా నియామకాల ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలను ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించినట్లయింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల
నియామకాల్లో మాత్రమే ఇది పని చేయనుండగా యూనిఫాం సర్వీసులు అంటే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖలకు సంబందించిన నియామకానికి ఈ వయో పరిమితి వర్తించదు.












Click it and Unblock the Notifications