మళ్లీ ఇప్పటంలో కూల్చివేతలు-ఇప్పటికే 90 శాతం పూర్తి- భారీ బందోబస్తు మధ్య...

గతంలో గుంటూరు జిల్లా ఇప్పటంలో సీఆర్డీయే అధికారులు చేపట్టిన కూల్చివేతల పర్వం పలు మలుపులు తిరిగి చివరికి హైకోర్టు ఆదేశాలతో అధికారిక ముద్ర వేయించుకుంది.

గుంటూరు జిల్లా ఇప్పటంలో గతంలో సీఆర్డీయే అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో చేపట్టిన కూల్చివేతల పర్వం వివాదాస్పదమైంది. దీనికి కారణం గతంలో జనసేన పార్టీ ఆవిర్బావ సభకు భూమి కేటాయించిన ఈ గ్రామంపై ప్రభుత్వ ఆగ్రహం. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించి స్ధానికులకు అండగా నిలిచారు. ఇప్పుడు మరోసారి ఇప్పటంలో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పలువురి ఇళ్లకు నోటీసులు ఇచ్చి అధికారులు గతంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ హైకోర్టుకు ఫిర్యాదు చేసిన స్ధానికులు.. స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే అధికారులు స్ధానికులకు ఇచ్చిన నోటీసులు హైకోర్టుకు సమర్పించడంతో వారంతా ఇరుకునపడ్డారు. హైకోర్టును తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు అందుకున్న వారందరికీ లక్ష రూపాయల చొప్పున న్యాయస్ధానం జరిమానా విధించింది.

another demolition drive begins at controversial ippatam village in guntur amid tight security

రోడ్డు విస్తరణ కోసం నోటీసులు ఇచ్చి కొన్ని కట్టడాలు కూల్చివేయడంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించలేదని తేలింది. దీంతో అధికారులు ఇప్పుడు మరోసారి ఇప్పటం గ్రామంలో మిగిలిన కూల్చివేతలు చేపట్టారు. ఇప్పటికే గతంలో గుర్తించిన వాటిలో 90 శాతం నిర్మాణాలు కూల్చేశారు. మిగిలిన వాటిలో ఇప్పుడు కూల్చివేతలు చేపడుతున్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి కూడా పటిష్ట బందోబస్తుతో ఈ కూల్చివేతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జనసేన నేతలు ఈసారి ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.

12 ఇళ్ల ప్రహరీ గోడలను నగరపాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో కూలగొట్టారు. కూల్చివేతలను అడ్డుకొంటూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిరసనల మధ్యే సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. గ్రామ సరిహద్దుల్లో పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చేవారిని తనిఖీ చేసి, వారి వివరాలను నమోదు చేసుకొని గ్రామంలోకి అనుమతిస్తున్నారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+