Borugadda Anil: బోరుగడ్డకు మరో పోలీసు రాచమర్యాద..! స్టేషన్లోనే దిండూ, దుప్పటిచ్చి..

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల అండతో చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు కూటమి ప్రభుత్వ వచ్చాక చుక్కలు కనిపిస్తాయని అంతా భావించారు.

కానీ సరిగ్గా దానికి రివర్స్ లో ఎక్కడకెళితే అక్కడ రాచమర్యాదలు చేస్తూ పోలీసులు ప్రభుత్వానికే షాకులిస్తున్నారు. నిన్న మొన్నటి రెస్టారెంట్లో బిర్యానీ ఎపిసోడ్ మర్చిపోక ముందే మరో రాచమర్యాదల వీడియో ఇప్పుడు బయటపడింది.

another royal treatment to borugadda anil kumar in Guntur police custody

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో వైసీపీ హయాంలో నమోదైన ఓ బ్లాక్ మెయిలింగ్ కేసులో తొలుత బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్టు చేసారు. అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోరుగడ్డపై నమోదైన కేసుల్లో అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపర్చడం, అనంతరం రిమాండ్ కు పంపడం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇదే బ్లాక్ మెయిలింగ్ కేసులో కోర్టు అనుమతి మేరకు మూడు రోజుల పాటు గుంటూరు పోలీసులు ఆయన్ను కస్డడీలోకి తీసుకున్నారు.

గత నెల 26 నుంచి 29 వరకు బోరుగడ్డ అనిల్ కుమార్ ను కస్టడీలోకి తీసుకొని ఆరండల్ పేట పోలీసులు విచారించారు. ఈ సమయంలో బోరుగడ్డను పోలీసులు ఏం ప్రశ్నించారో తెలియదు కానీ రాచమర్యాదలు మాత్రం బాగా చేశారు. సాక్షాత్తు కుర్చీలు వేసి దగ్గరుండి మరీ అన్నం వడ్డించారు. అంతే కాదు కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించారు. ఇంతటితో ఆగకుండా పడుకోవడాని సైతం ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు వేశారు. వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. కూర్చోవడానికి కుర్చీ వేయండి అంటూ పోలీసులకు బోరుగడ్డ హుకుం జారీ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

తాజాగా అమరావతి పరిధిలో నమోదైన మరో రెండు కేసుల్లో కోర్టులో హాజర పర్చాక రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తూ బోరుగడ్డను గన్నవరంలోని ఓ రెస్టారెంట్ వద్ద బిర్యానీ తినిపిస్తూ పోలీసులు దొరికిపోయారు. దీంతో ఏకంగా ఏడుగురు పోలీసులను గుంటూరు ఎస్పీ సస్పెండ్ చేసారు. ఈ ఘటనలో పోలీసులు బోరుగడ్డ అనుచరుడితో బిల్లు కట్టించినట్లు తేలడంతో వారిపై శాఖాపరమైన విచారణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మర్చిపోక ముందే పోలీసు కస్టడీలోనే రాచమర్యాదల వీడియో బయటపడటంతో అధికార పార్టీ నేతలు రగిలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+