వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి ఇంకో షాక్ .. బడికొస్తా పథకంపై ఎంక్వైరీ షురూ..

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, టీడీపీకి వరుస షాకులిస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టిడిపిని టార్గెట్ చేసుకుని పాలన సాగిస్తోంది. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అన్ని పథకాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవినీతిమయమని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పై రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అలాగే విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా కేంద్రం వద్దని చెబుతున్నా సమీక్ష నిర్వహించాలని అడుగు ముందుకేసింది. ఇక అమరావతి భూముల విషయంలో, కరకట్ట పై అక్రమ నిర్మాణాల విషయంలో చాలా సీరియస్ గా స్పందించింది. అన్నా క్యాంటీన్ లలోనూ అవినీతి జరిగిందన్న వైసీపీ ఇప్పుడు తాజాగా టిడిపి హయాంలో 'బడికొస్తా పథకం' పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని భావిస్తోంది. దీనిపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

నేడు ఏపీ గవర్నర్ హరి చందన్ జన్మదిన వేడుకలు .. చిన్నారుల మధ్య సెలబ్రేషన్స్నేడు ఏపీ గవర్నర్ హరి చందన్ జన్మదిన వేడుకలు .. చిన్నారుల మధ్య సెలబ్రేషన్స్

 టీడీపీ హయాంలో బడికొస్తా పథకంపై విచారణకు ఆదేశించిన జగన్ సర్కార్

టీడీపీ హయాంలో బడికొస్తా పథకంపై విచారణకు ఆదేశించిన జగన్ సర్కార్

ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం టిడిపికి ప్రాణసంకటంగా మారింది. సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం టీడీపీకి తలనొప్పిగానే మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గత ప్రభుత్వం బడికొస్తా పథకం పేరుతో కోట్ల రూపాయల అవినీతి చేసినట్లుగా భావించి వైసీపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. అదే విధంగా ఈ స్కీమ్ లో అక్రమాలపైనా క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఆదేశించినట్లు సమాచారం.

విద్యార్థినులకు టీడీపీ సైకిళ్ళ స్కీమ్ .. తయారీ స్కామ్ అంటున్న వైసీపీ

విద్యార్థినులకు టీడీపీ సైకిళ్ళ స్కీమ్ .. తయారీ స్కామ్ అంటున్న వైసీపీ


ఇక బడికొస్తా స్కీమ్ లో విద్యార్థినులకు పాఠశాలలకు రావడం కోసం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సైకిళ్ళు ఇవ్వాలని నిర్ణయించింది నాటి టిడిపి ప్రభుత్వం. దీనికోసం మొత్తం 3,80,275 సైకిళ్లు కొనాలని నిర్ణయించింది. రూ.151 కోట్లు అంచనాగా కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సైకిళ్లు తయారుచేసే ఛాన్స్ చెన్నైకి చెందిన ఐటీ సైకిల్స్ కంపెనీకి దక్కాల్సి ఉన్నాఇక్కడే గోల్ మాల్ జరిగినట్లు వైసిపి ఆరోపిస్తోంది.

చెన్నైకి చెందిన కంపెనీ కోట్ చేసిన రేటు కంటే ఒక్కో సైకిల్‌కీ రూ.500 ధర పెంచి పంజాబ్ , లుథియానాకు చెందిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు. తక్కువ రేటుకే చేస్తానన్న చెన్నై కంపెనీని 15,000 సైకిళ్లు తయారుచేసి ఇవ్వమని చెప్పి అదే లూథియానాకు చెందిన రెండు కంపెనీలకు మాత్రం ఏకంగా 3,65,275 సైకిళ్ల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ రెండు కంపెనీలు టైముకి సైకిళ్లు చేసి ఇవ్వలేకపోయాయి. వాటికి సమయం కూడా పెంచి ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినా ఆ కంపెనీలు సరైన సైకిళ్లు చేసి ఇవ్వలేకపోయాయి.

 విచారణకు ఆదేశం .. దర్యాప్తులో అక్రమాలు తేలితే క్రిమినల్ కేసులు

విచారణకు ఆదేశం .. దర్యాప్తులో అక్రమాలు తేలితే క్రిమినల్ కేసులు

ఇక ప్రస్తుతం పంజాబ్, లూధియానాలకు చెందిన కంపెనీలు పంపిన సైకిళ్లలో క్వాలిటీ లేదని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అందుకే... ఈ స్కీం కింద ఇవ్వాల్సిన రూ.151 కోట్లలో ఇప్పటివరకూ రూ.30 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగతా రూ.121 కోట్లూ ఇవ్వకుండా దర్యాప్తుకి ఆదేశించింది.

ఇప్పుడు బడికొస్తా పథకంలో సైకిళ్ల స్కీంలో అక్రమాలు నిజమేనని తేలితే క్రిమినల్ కేసులు పెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. దాదాపు రూ.18 కోట్ల అవినీతి జరిగినట్టుగా అంచనా వేస్తుంది. అందుకు ఆధారాలు లభిస్తే... గత ప్రభుత్వాన్ని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇరకాటంలో పెట్టె ఆలోచనలో ఉంది . కోర్టులో నిలబెట్టే అవకాశం ఉంది. దర్యాప్తు తర్వాత ఈ స్కీమ్ లో జరిగిన స్కామ్ ఎంతో బయటపెడతామని చెబుతోంది. బడికొస్తా పథకంలో సైకిళ్ళ స్కామ్ విషయం అటుంచితే గత ప్రభుత్వం విద్యార్థులకు అందించాలని అనుకున్న సైకిళ్ల పథకం మాత్రం ఇక లేనట్టే అనే విషయం ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో తేటతెల్లమవుతుంది.

English summary
The coming to power of the YSR Congress party in AP became a deadly blow to the TDP. Every decision taken by CM Jaganmohan Reddy's administration has been a headache for the TDP. Recently the YCP Sarkar ordered the enquiry into alleged corruption in the name of Badikosta Scheme. The purchase of bicycles feels corrupt. Similarly, it has been reported that criminal cases have been registered in this scheme.he TDP government of Badikosta scheme has decided to give away bicycles to girl students to avoid absent to school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X