అమరావతిలో మరో తాత్కాలికం-నేడు ప్రారంభిస్తున్న జగన్, సీజేఐ-హైకోర్టు బ్రేకుల వేళ !
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న తాత్కాలిక నిర్మాణాలను ఒక్కొక్కటిగా విశాఖ, కర్నూలు రాజధానులకు తరలించేందుకు వైసీపీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. హైకోర్టు జోక్యంతో వాటికి ఒక్కొక్కటిగా బ్రేకులు పడుతూ వచ్చాయి. చివరికి అమరావతే ఏకైక రాజధానిగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తరలింపులు అన్నింటికీ బ్రేక్ పడినట్లయింది. ఈ నేపథ్యంలో ఓ కీలక సంస్ధను న్యాయరాజధాని అయిన కర్నూల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అది అమరావతిలోనే ఏర్పాటవుతోంది.

తాత్కాలిక అమరావతి
అమరావతి అంటేనే తాత్కాలిక రాజధాని అనిపించేలా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు మొగ్గు చూపడం లేదు. అలాగే తాత్కాలిక నిర్మాణాలను కూడా కొత్తగా ఏవీ చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి బదులు ఇతర రాజధానులైన కర్నూలు, విశాఖల్లో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథధ్యంలో అమరావతిలో ఇప్పటికే కట్టిన సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ అధికారుల, ఎమ్మెల్యేల నివాస ప్రాంగణాలు, కార్యాలయాలు ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. వీటిలో ఏది ఎప్పుడు కొనసాగుతుందో, ఎప్పుడు తరలిపోతుందో ఎవరికీ తెలియని పరిస్దితి. ఈ నేపథ్యంలో మరో తాత్కాలిక నిర్మాణాన్ని ఇవాళ వైసీపీ సర్కార్ ప్రారంభించబోతోంది.

మంగళగిరిలో జ్యుడిషియల్ అకాడమీ
ప్రస్తుతానికి ఏపీకి ఏకైక రాజధానిగా ఉన్న అమరావతిలో ఇప్పటికే నిర్మించిన పలు భవనాలు వాడకుండా అలాగే పక్కన పడేసి ఉన్నాయి. వీటిలో ఒక దానిని ఏపీ జ్యుడిషియల్ అకాడమీ కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. మంగళగిరిలో ఉన్న ఈ భవనంలో జ్యుడిషియల్ అకాడమీని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇవాళ సీఎం జగన్, సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కలిపి దీన్ని ప్రారంభించబోతున్నారు. న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. దీంతో దీనిపై హైకోర్టు ఈ మధ్య జారీ చేసిన కీలక ఆదేశాలతో ఈ భవనం మంగళగిరిలో ప్రారంభిస్తున్నారు.

కర్నూలుకు హైకోర్టు నో చెప్పడంతో
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం న్యాయరాజధానిగా ఎంపిక చేసిన కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర పెద్దల్ని కలిసి పదే పదే విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే కేంద్రం మాత్రం హైకోర్టు సీజేతో మాట్లాడుకుని దీన్ని తరలించాలని చెబుతోంది. దీంతో బంతి కాస్తా హైకోర్టు సీజే కోర్టులోకి వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వం జ్యుడిషియల్ అకాడమీని కర్నూల్లో ఏర్పాటు చేసేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు.. జ్యుడిషియల్ అకాడమీని కర్నూల్లో ఏర్పాటు చేసేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు ఆగ్రహంతో మంగళగిరిలోనే జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జాారీ చేసింది. ఈ జ్యుడిషియల్ అకాడమీ ఇవాళ జగన్, సీజేఐ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications