వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలో మరో రెబెల్ ఎంపీ రెడీ ? ఢిల్లీలో టీడీపీ అసంతృప్త ఎంపీ ఇంట్లో భేటీ-మరో రఘురామ అవుతారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటకల్ వార్ గురించి సాగే చర్చలో ఇరు పార్టీల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసేందుకు చాలా చార్లు చాలా చిన్నవిగానే కనిపిస్తుంటాయి. కానీ సమయం వచ్చినప్పుడు వాటి అసలు రూపం బయటపడుతుంటుంది. ఆరంభంలో వైసీపీలో రఘురామకృష్ణంరాజు వ్యవహారం కూడా ఇలాగే కనిపించేది. కానీ బీజేపీ ఎంపీలకు ఆయన ఇచ్చిన విందుతో మొదలైన రెబల్ పాలిటిక్స్ ఆ తర్వాత ఓ రేంజ్ కు వెళ్లిపోయాయి. ఇప్పుడు వైసీపీలో మరో ఎంపీ వ్యవహారం కూడా ఇలాగే ముదురుతోంది.

 వైసీపీలో అసంతృప్తులు

వైసీపీలో అసంతృప్తులు

ఏపీలో మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైసీపీలో పలువురు అసంతృప్తులు క్రమంగా బయటకి వస్తున్నారు. మూడేళ్ల పాలన తర్వాత వైసీపీపై, వైఎస్ జగన్ పై తమకున్న అసంతృప్తిని పలు రకాలుగా వారు బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా అందరికంటే ముందు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన అసంతృప్తిని బయటపెట్టడమే కాదు, పార్టీకి దూరమై ఏకంగా అధినేత జగన్ నే టార్గెట్ చేశారు. ఇందుకోసం విపక్ష టీడీపీ సహకారం కూడా తీసుకునే స్ధాయికి వెళ్లారు. చివరికి ఏపీకే దూరమ్యయే పరిస్ధితులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే మరో ఎంపీ కూడా అదే బాట పట్టేలా కనిపిస్తున్నారు.

 రఘురామబాటలో లావు కృష్ణదేవరాయలు ?

రఘురామబాటలో లావు కృష్ణదేవరాయలు ?

వైసీపీతో తీవ్రంగా విభేదిస్తున్న రఘురామకృష్ణంరాజు మూడేళ్లుగా ఢిల్లీలోనే ఉంటూ ఏపీ ప్రభుత్వంపై, జగన్ పై బాణాలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఆయన బాటలోనే మరో ఎంపీ కూడా వెళ్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. పల్నాడు జిల్లాగా మారిన నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు కూడా స్ధానికంగా ఉన్న మంత్రి విడదల రజనీతో ఎప్పటినుంచో పోరాడుతున్నారు. ఎంపీ అయిన తాను చిలకలూరిపేటలో కూడా అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న రజనీతో నెలకొన్న పోరుపై అధిష్టానం కూడా మౌనం వహించడంతో లావు కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రజనీతో ముఖాముఖీ పోరాడిన లావుకు అధిష్టానం ఆమెను ఏకంగా మంత్రిని చేయడంతో పరిస్ధితి పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న లావు కృష్ణదేవరాయలు.. సమయం వచ్చినప్పుడు స్పందించాలని భావిస్తున్నారు.

ఢిల్లీలో కేశినేని ఇంటికి లావు కృష్ణదేవరాయలు

ప్రస్తుతం టీడీపీతో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో పలువురు విపక్ష పార్టీల ఎంపీల్ని తన ఇంటికి ఆహ్వానించారు. ఇందులో సొంతపార్టీ టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ తో పాటు వైసీపీకి చెందిన లావు కృష్ణదేవరాయలు కూడా వెళ్లారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ, విప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఓ రేంజిలో జ‌రుగుతున్న నేపథ్యంలో దీంతో త‌న‌కేమీ సంబంధం లేద‌న్న రీతిలో ఈ వైసీపీ ఎంపీ టీడీపీ ఎంపీల‌తో క‌లిసి క‌నిపించారు. అంతేకాకుండా టీడీపీతో పాటు మ‌రికొన్ని పార్టీల ఎంపీల‌తో క‌లిసి ఆయ‌న నేరుగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అక్క‌డ టీడీపీ ఎంపీలు కేశినేని, గ‌ల్లా జ‌య‌దేవ్‌, రామ్ మోహ‌న్ నాయుడులతో గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫొటోలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, వైసీపీ ఎంపీ లావుల‌తో పాటు డీఎంకేకు చెందిన ఎంపీలు క‌నిమొళి, త‌మిజాచ్చి తంగ‌పాండియ‌న్‌, క‌థిర్ ఆనంద్‌, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివ‌సేన ఎంపీ ధైర్య‌శీల్ మానే త‌దిత‌రులు కూడా ఉన్నారు. తామంతా క‌లిసి కేశినేని నాని ఇంటికి వెళ్లిన‌ట్లు పేర్కొన్న‌ డీఎంకే ఎంపీ కథిర్ ఆనంద్ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు

జగన్ బుజ్జగిస్తారా ? వదిలేస్తారా

జగన్ బుజ్జగిస్తారా ? వదిలేస్తారా


అయితే ఇలాంటి పరిస్ధితుల్లో జగన్ ఏం చేయబోతున్నారన్న చర్చ మొదలైంది. గతంలో రఘురామకృష్ణంరాజు విషయంలో జగన్ ఆరంభంలో లైట్ తీసుకోవడంతోనే ఆ తర్వాత ఆయన కొరకకాని కొయ్యగా మారారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు లావు విషయంలోనూ జగన్ అలాగే వ్యవహరిస్తారా లేక బుజ్జగింపులు చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వైసీపీ అధిష్టానం లావు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్దితులు కనిపించడం లేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి మాత్రం నరసరావుపేటలో ప్రత్యామ్నాయాలు వెతుక్కోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆ లోపు లావు మరిన్ని అడుగులు వేస్తే మాత్రం కచ్చితంగా వైసీపీ స్పందించే అవకాశాలు ఉంటాయి.

English summary
ysrcp's disgruntled mp lavu krishna devarayalu has met tdp's rebel mp kesineni nani in his residence at delhi yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X