ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలో మళ్లీ మార్పు: కొత్త డేట్ ఫిక్స్
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రుల ప్రమాణ స్వీకారం, శాఖల కేటాయింపు చకచకా పూర్తయ్యాయి. చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. పాలనను పరుగులెత్తించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అయిదు గ్యారంటీలపై సంతకాలూ చేశారు.
21, 22 తేదీల్లో
ఇక ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా పొన్నూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్పీకర్‌గా ఆ సీనియర్..
మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు సభ్యులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్‌గా నామినేట్ చేస్తారని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా జనసేన పార్టీకి చెందిన నెల్లిమర్ల శాసన సభ్యురాలు లోకం మాధవిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
24 నుంచి
దీని తరువాత ఒక రోజు విరామం ఉంటుంది. మళ్లీ 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు యధాతథంగా కొనసాగుతాయి. పెండింగ్ బిల్లులు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రావచ్చు.
పోలవరం సహా..
పోలవరం సహా గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయటంపైనా మంత్రులు చర్చిస్తారని అంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై నమోదైన కేసులను ఉపసంహరణ, కొన్ని శాఖలు చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న అక్రమాలపై మంత్రివర్గం ఆరా తీస్తుందని అంటున్నారు.
పట్టిన పట్టు..
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సుదీర్ఘకాలం పాటు అసెంబ్లీలో అడుగు పెట్టని విషయం తెలిసిందే. నిండు సభలో తనను, కుటుంబ సభ్యులను అవమానించారని, ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ అప్పట్లో ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు దాన్ని నెరవేర్చుకున్నట్టయింది. ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.












Click it and Unblock the Notifications