Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్..!

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఎక్కడో తాకాయి. దీంతో స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరుకాలేదు. ఆ తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చినా ఒకరోజు మాత్రమే ఉండి వెళ్లిపోతున్నారు. రాలేదన్న అపవాదు ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇలా జగన్ అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోతుంటే అధికార కూటమికి కానీ, స్పీకర్ కు కానీ ఏం చేయాలో తెలియని పరిస్ధితి.

ఇప్పటికే జగన్ ను అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని శాసనసభా వ్యవహారాలమంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు. అయినా తనకు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్న ప్రభుత్వం, స్పీకర్ పై ఆగ్రహంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. దీంతో ఇవాళ మరోసారి స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ అసెంబ్లీకి రావాలని అయన్నపాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు.

ap assembly speaker ayyannapatrudu invites ys jagan to come offer to give time for debates

జగన్ ఇప్పుడు సీఎం కాదని, ఓ ఎమ్మెల్యే మాత్రమేనని అయన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీకి వచ్చి జగన్‌ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలని కోరారు. అసెంబ్లీకి రాననడం సరికాదన్నారు. జగన్‌కు తన సలహా ఒక్కటేనని, పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. అందుకు తాను అవకాశం కల్పిస్తానని తెలిపారు. తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారని జగన్ ను స్పీకర్ ప్రశ్నించారు. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్‌కు మాట్లాడటానికి అవకాశం ఇస్తానన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+