ఏపీ డీజీపీ సహా 22 ఐపీఎస్ లపై ఈసీ వేటు-పురందేశ్వరికి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్...!
ఏపీలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు సహా 20 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలని కోరుతూ ఈసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదులో పలువురు ఐపీఎస్ అధికారులపై పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు వారిపై వెంటనే వేటు వేయాలని ఈసీని కోరారు. దీనిపై వైసీపీ భగ్గుమంది.
పురందేశ్వరి చంద్రబాబు కోసం బరితెగించి ఉత్తరాలు రాస్తున్నారని వైసీపీ మాజీ మంంత్రి పేర్నినాని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరితెగింపు ఇప్పుడే చూస్తున్నామన్నారు. 22 మంది ఐపీఎస్ అధికారులపై పురందేశ్వరి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నాని ఆరోపించారు. చంద్రబాబు వదిన తన మరిది కోసం బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారన్నారు. చంద్రబాబు వదిన అయిన పురంధేశ్వరి అప్పుడు తండ్రి ఎన్టీఆర్ ముందు శిఖండిగా ఉన్నారని, ఇప్పుడు పెత్తందారు చంద్రబాబు కోసం పని చేస్తున్నారని విమర్శించారు.

సంస్కారం మర్చిపోయి పురందేశ్వరి మళ్ళీ శిఖండి అవతారం ఎత్తారని పేర్ని విమర్శింంచారు. వదిన ఎప్పుడు చంద్రబాబు ను కాపాడేందుకు ముందున్నారన్నారు. బీజేపీలో టీడీపీ దొంగలు పడ్డారని పేర్ని ఆరోపించారు. ఐపీఎస్ లపై ఆమె నిరాధార ఆరోపణలు చేశారన్నారు. మరిది కళ్ళలో ఆనందం కోసం పురంధేశ్వరి బరి తెగించారన్నారు. వదిన బరితెగింపు కాక ఇంకేం అంటారని ప్రశ్నించారు.
అలాగే బీజేపీ ఏపీ చీఫ్ బరితెగించి నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎందుకు ఊరుకుంటున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. ఎందుకు సీఈఓ నిలదీయడం లేదని అడిగారు. ఎందుకు సీఈఓ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారికి పురంధేశ్వరి మార్చమని కొన్ని పేర్లు ఇచ్చారని, సీఈఓకి పురంధేశ్వరి బాసా అని అడిగారు. అలాగే డీజీపీని తీసి ఎవరిని వేయాలని కూడా అడిగారు.












Click it and Unblock the Notifications