ఉగాది వేడుకల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులు.. జగన్ ఆకాంక్ష ఇదే!!
తెలుగువారు అందరూ అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ఉగాది పండుగ. ఈ సంవత్సరం ఉగాది పండుగను అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. వసంతకాలానికి స్వాగతం పలుకుతూ, ఉగాది పచ్చడి షడ్రుచులను ఆస్వాదిస్తూ జరుపుకుంటున్న ఈ ఉగాది ఈ సంవత్సరం ఏపీలో చాలా ప్రత్యేకం. ఈసారి ఎన్నికల సంవత్సరం కావటంతో ఈ ఉగాది తమకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అని అంతా పంచాంగాలను తిరగేస్తున్నారు.
ఉగాది వేడుకల్లో సీఎం దంపతులు
ఇక నేడు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పల్నాడు జిల్లాలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలోని శ్యావలా పురం మండలం, గంటా వారి పాలెం వద్ద నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ , ఆయన సతీమణి భారతితో కలసి పాల్గొన్నారు .

ఉగాది నాడు సీఎం జగన్ ఆకాంక్ష
ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి, సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులకు ఉగాది పచ్చడిని అందజేశారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి వైపు పయనించాలన్న సీఎం జగన్
ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి వైపు పయనించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అంతేకాదు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు జరగాలని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు.
జగన్ తో పాటు ఉగాది వేడుకల్లో వైసీపీ అభ్యర్థులు
ఈరోజు క్రోధి నామ ఉగాది వేడుకలలో సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులతో పాటుగా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications