YS Jagan Whatsapp : వైఎస్ జగన్ వాట్సాప్ ఛానల్ ప్రారంభం-ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు..
ఏపీలో అత్యంత ప్రజాకర్షక నేతగా ఎదిగిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా వాట్సాప్ ఛానల్లోకి ఎంటరయ్యారు. తన పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాట్సాప్ ఛానల్ ను ప్రారంభించారు. ప్రజలకు డిజిటల్ గా మరింత దగ్గరయ్యేందుకు వీలుగా ఈ వాట్సాప్ ఛానల్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ విడుదల చేసింది. ఇందులో ప్రస్తుతానికి ఏడున్నర వేల ఫాలోవర్లు ఉన్నారు.

ఏపీలో పౌరులతో ప్రత్యక్ష డిజిటల్ సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాట్సాప్ ఛానెల్‌లలో చేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఛానల్ ద్వారా జగన్ మరింత మెరుగైన కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ వాట్సాప్ ఛానల్ లో సీఎం జగన్ తన ప్రారంభ సందేశంలో.. వైబ్రెంట్ వాట్సాప్ కమ్యూనిటీలో భాగమైనందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "నేను WhatsApp కమ్యూనిటీలో చేరినందుకు, మీ అందరితో డిజిటల్‌గా కనెక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ మీతో సన్నిహితంగా ఉండటానికి ఎదురు చూస్తున్నాను! అని పేర్కొన్నారు.
సమాచార వ్యాప్తి, పరస్పర సంభాషణల కోసం ప్రత్యక్ష ఛానెల్‌ని అందించడం ద్వారా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య బంధం బలోపేతమవుతుందని సీఎంవో పేర్కొంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పౌరులు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, విధాన ప్రకటనలు, ఇతర సంబంధిత సమాచారంపై అప్ డేట్స్ అందుకోవచ్చు. వాట్సాప్ ఛానెల్‌లలో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం సమర్థవంతమైన పాలన , పారదర్శకత అందించే విషయంలో జగన్ నిబద్ధతను సూచిస్తుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాట్సాప్ ఛానల్ ను ఫాలో కావాలంటే ఈ లింక్ ను క్లిక్ చేయాలని సీఎంవో తెలిపింది.
https://whatsapp.com/channel/0029Va4JGNi42DccmaxNjf0q












Click it and Unblock the Notifications