శిల్పా ఎఫెక్ట్: దిద్దుబాటులో టిడిపి, 'ఉప ఎన్నిక వాయిదాకు కుట్ర'

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేయకుండా, వ్యక్తులకు, గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తే నష్టమనే విషయాన్ని టిడిపి నాయకత్వం గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ ప్రభావం పడకుండా ఉండేందుకుగాను టిడిపి నాయకత్వం నష్టనివారణ చర్యలకు పూనుకొంది.

బాబు తీరుతో అలిగాను, జగన్ వల్లే... ఎస్‌పివై సంచలనం

సంస్థాగత నిర్మాణం విషయంలో టిడిపి నాయకత్వం కఠినంగానే ఉంటుంది. అయితే పార్టీ అవసరాల రీత్యా 2014 ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులను టిడిపిలో చేర్చుకొంది. అలా పార్టీలోకి వచ్చిన నేతలు ప్రస్తుతం మంత్రులుగా, ఎంపిలు, ఎమ్మెల్యేలుగా కూడ ఉన్నారు.

గెలుపు ఓటములపై 'గోస్పాడు', భూమా ఫ్యామిలీకి కలిసి వచ్చేనా?, వైసీపీ ధీమా ఇదే

అయితే కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తులు, గ్రూపులకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. అయితే ఆ వ్యక్తులు గ్రూపులు పార్టీ మారిన సమయంలో పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాలలో శిల్పా సోదరులు పార్టీ మారడంతో ఈ పరిస్థితి నెలకొంది.

''పాపానికి ఓటు వేయాలని దేవుడు చెప్పడు, అంతిమ విజయం హీరోదే, బాబుకు ఉరిశిక్షైనా తక్కువే''

ఎట్టకేలకు ఈ విషయాన్ని టిడిపి నాయకత్వం గుర్తించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకుగాను జాగ్రత్తలను తీసుకొంటుంది టిడిపి.

శిల్పా సోదరుల నిష్క్రమణతో టిడిపి ఇలా.

శిల్పా సోదరుల నిష్క్రమణతో టిడిపి ఇలా.

సంస్థాగతంగా టిడిపి కఠినంగా వ్యవహరిస్తోంది. సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ కమిటీల ఎన్నికలు తదితర విషయాల్లో నియమాల ప్రకారంగా వ్యవహరించనుంది.అయితే కొన్ని సమయాల్లో కొంత ఇబ్బందిగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇతర పార్టీల్లో మాదిరిగానే వర్గాలకు, గ్రూపులకు, వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి టిడిపికి అనివార్యమైంది. నంద్యాలలో శిల్పా సోదరులు పార్టీ నుండి వెళ్ళిపోయే సమయంలో తమ వర్గాన్ని కూడ పార్టీ నుండి తీసుకెళ్ళారు. దీని ప్రభావం టిడిపిపై నెలకొంది. దీంతో నష్టనివారణకు టిడిపి పూనుకొంది.

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
 సంస్థాగత నిర్మాణానికే ప్రాధాన్యత

సంస్థాగత నిర్మాణానికే ప్రాధాన్యత

రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో మాదిరిగానే నంద్యాలలో కూడ టిడిపి సంస్థాగత నిర్మాణం దెబ్బతిన్న విషయాన్ని టిడిపి నాయకత్వం గుర్తించింది. వ్యవస్థను కాకుండా వ్యక్తులను, గ్రూపులను సంతృప్తి పర్చే విధానం కారణంగానే నష్టపోతున్న విషయాన్ని టిడిపి గుర్తించింది.నంద్యాలలో టిడిపి ఇంచార్జీగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.రాయలసీమకు చెందిన ముఖ్యనేతలను నంద్యాల బరిలో దించింది టిడిపి నాయకత్వం.

ఉపఎన్నిక వాయిదాకు కుట్ర

ఉపఎన్నిక వాయిదాకు కుట్ర

ఓటమి భయంతోనే నంద్యాల ఉప ఎన్నికను వాయిదా వేయించేందుకు వైసీపీ చీఫ్ జగన్ కుట్ర పన్నుతున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కె.ఈ. కృష్ణమూర్తి ఆరోపించారు. ఓటమి ఖాయం కావడంతో జగన్ ఉన్మాదిగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. పరిపక్వత లేని జగన్ రాజకీయాలకు పనికిరాడన్నారు.

2019 ఎన్నికలకు నంద్యాల సెమీ ఫైనల్స్

2019 ఎన్నికలకు నంద్యాల సెమీ ఫైనల్స్


2019 ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీయే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే అధికార, విపక్షాలు ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి.ఈ నెల 9వ, తేది నుండి వైసీపీ చీఫ్ జగన్ నంద్యాలలోనే మకాం వేశారు.8 మంది మంత్రులు నంద్యాలలోనే మకాం వేశారు. వైసీపీ కీలక నేతలంతా నంద్యాలలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలను చేస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap Deputy chief minister K.E. Krishnamurthy made allegations on Ysrcp. Ysrcp planning to cancel Nandyal by poll he said.He spoke to media on Saturday.
Please Wait while comments are loading...