Dussehra Holidays: స్కూళ్లకు దసరా సెలవులు పొడిగిస్తున్నారా ?
ఏపీలో దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం దసరా సెలవుల్ని విద్యార్ధులు, తల్లితండ్రులతో పాటు టీచర్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సెలవులు అక్టోబర్ 2తో ముగియనున్నాయి. తిరిగి అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవుల పొడిగింపుపై చర్చ మొదలైంది. అక్టోబర్ 2 వరకూ ఇచ్చిన దసరా సెలవుల్ని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
విజయదశమికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సెలవులపై విద్యార్థులు, పేరెంట్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పండుగ రోజైన అక్టోబర్ 2 వరకు సెలువులు ఇచ్చి 3వ తేదీ నుంచే తిరిగి క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఊర్లకు వెళ్లిన వారు పండుగ రోజు రాత్రికి రాత్రి ఎలా బయల్దేరి వస్తారని పేరెంట్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దసరా సెలవుల్ని పొడిగించాలని కోరుతున్నారు.

అక్టోబర్ 2 వరకూ ఇచ్చిన దసరా సెలవుల్ని మరో రెండు రోజులు పొడిగించాలని విద్యార్ధులు, తల్లితండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంటే అక్టోబర్ 4 లేదా 5వ తేదీకి సెలవులు పొడిగించి, అవసరమైతే రెండో శనివారం పని దినంగా ప్రకటించాలని సూచిస్తున్నారు. దీంతో దసరా సెలవులకు ఊర్లకు వెళ్లిన విద్యార్ధులు, తల్లితండ్రులు, టీచర్లు కూడా పండుగ రోజు తిరిగి స్వస్థలాలకు బయలుదేరకుండా వెసులుబాటు లభిస్తుందని చెబుతున్నారు.

అయితే ప్రభుత్వం ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ విద్యార్ధులకు ఇచ్చిన సెలవుల పొడిగింపు విషయంలో ప్రభుత్వానికి వినతులు అందుతూనే ఉన్నాయి. గతంలో సెలవుల పొడిగింపు విషయంలో ఓసారి టీచర్ ఎమ్మెల్సీల వినతి మేరకు రెండు రోజులు పొడిగించి ముందుగానే సెలవులు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు సెలవులు ముగిశాక పొడిగింపు విషయంలో వస్తున్న వినతులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రెండు రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications