వైజాగ్ స్టీల్ బిడ్ అసలు సంగతి ఇదీ..జగన్ ఏనాడో చెప్పారు- సజ్జల క్లారిటీ..

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. నిన్న మొన్నటివరకూ దీనిపై సైలెంట్ గా ఉన్న ఏపీ రాజకీయ పార్టీలు..ఇప్పుడు తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ ఎంట్రీతో స్పందిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతోంది పరిమిత భాగస్వామ్యం కోసం బిడ్ల సేకరణ మాత్రమేనన్నారు.

పరిమిత భాగస్వామ్యం కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోసం వైజాగ్ స్టీల్ బిడ్లు కోరుతుంటే ఏపీలో విపక్షాలు, మీడియా మాత్రం దీన్ని బీఆర్ఎస్ కొంటోందని దుష్ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. బిడ్ల కోసం వైజాగ్ స్టీల్ ఇచ్చిన ప్రకటనను ఆయన చదివి వినిపించారు. గతంలో వైఎస్ జగన్ కూడా ప్లాంట్ కొనసాగింపుకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరారని సజ్జల గుర్తుచేశారు. ఇవాళ అదే విషయం తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా చెప్పారన్నారు.

ap government advisor sajjala ramakrishnareddy

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రస్తుతం ఉన్నట్లుగానే ముందుకు సాగాలనే తాము కోరుకుంటున్నట్లు సజ్జల వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొంటుందా అంటూ సజ్జల ఎదురు ప్రశ్నించారు. ఇవాళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తాము ఎక్కడా స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం బిడ్ వేస్తున్నట్లు చెప్పలేదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ప్రకటనలోనూ టేకోవర్ కోసం బిడ్లు కోరలేదన్నారు.

మరోవైపు ఏపీలో సంక్షేమ పథకాల అమలును విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని సజ్జల ఆరోపించారు. వైజాగ్ స్టీల్ విషయంలో బీఆర్ఎస్ ముందుకొస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందని విపక్షాలు ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఈవోఐ బిడ్ వేయాలని నిర్ణయిస్తే దాన్ని ఏపీ ప్రభుత్వం వైఫల్యంగా చూపిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+