ఏపీలో సచివాలయాల్లో మార్పులు మొదలు-క్లస్టర్ల ఏర్పాటు, ఉద్యోగుల విభజన..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధలో పెను మార్పు. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్ధలో ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేసేందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఇందులో భాగంగా అధికారులకు ఏపీ సేవ పోర్టల్ లో సచివాలయ హేతుబద్ధీకరణ వీలుగా ఆప్షన్లు ఇచ్చారు. దీంతో అధికారికంగా ఈ ప్రక్రియ మొదలైనట్లయింది.

ap government begins rationalization of secretariats given options to mpdos commissioners

రాష్ట్రంలో సచివాలయాల హేతుబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రతీ మండల, పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న సచివాలయ విభజన కోసం క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతీ క్లస్టర్ పరిధిలో రెండు సచివాలయాను ఏర్పాటు చేయబోతున్నారు. స్థానికంగా ఉండే జనాభా, పొరుగు సచివాలయానికి ఉండే దూరం ఆధారంగా వీటిని ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పటికే ఉన్న సచివాలయాలను ఆయా క్లస్టర్ల వారీగా విభజిస్తారు. ఏదైనా మండలం లేదా పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఎక్కువగా సచివాలయాలు ఉంటే 3 వరకూ సదరు క్లస్టర్ కు అనుసంధానం చేయవచ్చు.

ఈ మేరకు మండలాల పరిధిలో ఎంపీడీవోలకు గ్రామ సచివాలయాలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మున్సిపల్ కమిషనర్లకు సచివాలయాల హేతుబద్ధీకరణ కోసం క్లస్టర్ల ఏర్పాటు, వాటికి సచివాలయాల అనుసంధానానికి అధికారాలు ఇచ్చారు. ఈ మేరకు వారు ఏపీ సేవ పోర్టల్ లో లాగిన్ అయి క్లస్టర్లను క్రియేట్ చేయడంతో పాటు తమ పరిధిలో ఉన్న సచివాలయాలను వాటికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సచివాలయం ఏదో ఒక క్లస్టర్ కు అనుసంధానం అవుతుంది. అలాగే వాటికి మార్పులు చేర్పులు చేసేందుకు కూడా ఆప్షన్లు ఇచ్చారు.

Take a Poll

మొత్తంగా ప్రతీ సచివాలయంలో పనిచేసే సెక్రటరీలను మూడు విభాగాలుగా విభజిస్తారు. ఇందులో మల్టీపర్పస్, టెక్నికల్, యాస్పిరేషనల్ విభాగాలు ఉంటాయి. మల్టీపర్పస్ విభాగంలో గ్రామ సచివాలయానికి చెందిన పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసు ఉంటారు. అలాగే వార్డు సచివాలయంలో అడ్మిషన్ కార్యదర్శి, ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్, డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా పోలీసు ఉంటారు.

అలాగే టెక్నికల్ విభాగంలో గ్రామ సచివాలయం నుంచి వీఆర్వో, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు. అలాగే వార్డు సచివాలయం నుంచి రెవెన్యూ కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, ప్లానింగ్-రెగ్యులేషన్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ ఉంటారు. మరోవైపు యాస్పిరేషన్ విభాగంలో IoTలు, AI, ఇతర టెక్నాలజీల తాజా డెవలప్‌మెంట్‌పై అభిరుచితో సాంకేతిక , సంబంధిత అర్హతలు కలిగి ఉన్న పైన మిగతా రెండు విభాగాల్లో ఉన్న వారిలో ఎవరైనా ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా నియమించబడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+