టీడీపీ నేత ట్వీట్ తో ఆ మహిళా ఐఏఎస్ పోస్టింగ్ రద్దు-షాకింగ్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు అఖిల భారత సర్వీస్ అధికారులపై కూటమి సర్కార్ వరుసగా కొరడా ఝళిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా 11 మంది పోస్టింగ్ లేని ఐపీఎస్ అధికారుల్ని హెడ్ క్వార్టర్స్ వదిలివెళ్లకుండా డీజీపీ ఆఫీసుకు రోజూ వచ్చి హాజరు వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూర్చుని వెళ్లాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఇదే క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

తాజా బదిలీల్లో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా యువ మహిళా ఐఏఎస్ అధికారిణి డి హరితను ఏపీ ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె వెళ్లి విధుల్లో జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్దమవుతున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ నిన్న ఉన్నట్లుండి ప్రభుత్వం ఆమె పోస్టింగ్ ను రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమెను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

ap government cancelled woman joint collector posting with tdp leader tweet

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఈ మధ్య ఓ ట్వీట్ చేశారు. గతంలో నెల్లూరు కమిషనర్ గా పనిచేసిన కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారిణి డి హరిత తాను చూసిన అత్యంత అత్యంత అవినీతిపరులైన ఐఏఎస్ ఆఫీసర్లలో ఒకరని ఆనం అందులో పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్‌లో టిడిఆర్ స్కామ్ యొక్క రూపశిల్పి అని కూడా తెలిపారు. దీంతో ఈ ట్వీట్ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం ఆరా తీయడం, గతంలో ఆమె వైసీపీ నేతలు చెప్పినట్లు విని అక్రమాలకు అండగా నిలిచారని నిర్ధారణకు రావడం, ఆమెపై వేటు వేయడం చకచకా జరిగిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+