ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు- ఇంటర్ సప్లిమెంటరీ కూడా- సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్ధితి ఎదురవుతుండటంతో పదోతరగతితో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి తగ్గకపోవడం, పరీక్షల నిర్వహణపై తల్లితండ్రుల నుంచి ఎదురవుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

Recommended Video

    AP 10th And Inter Supplementary Exams Cancelled, Grades Will Decide Soon || Oneindia Telugu

    ఏదో విధంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్ధుల భవిష్యత్ తో పాటు ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వం చివరి నిమిషం వరకూ ప్రయత్నించిందని, కోర్టులు కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నాయని, అయితే అన్ని పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షల రద్దు తప్పలేదని విద్యామంత్రి సురేష్ తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో పేపర్లను 11 నుంచి ఆరుకు తగ్గించడం ద్వారా ఎలాగైనా పరీక్షల నిర్వహణకు ప్రయత్నించినట్లు సురేష్ వెల్లడించారు. విద్యార్ధుల ఆరోగ్యం, తల్లితండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ పరీక్షల రద్దుకే మొగ్గు చూపారని సురేష్ తెలిపారు.

    ap government cancels ssc and inter supplimentary exams due to covid 19 spread

    ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రద్దుతో తలెత్తే పరిస్ధితులను ఎదుర్కొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సురేష్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల రద్దుతో ఇప్పటికే ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులను కూడా పాస్ చేస్తున్నట్లు విద్యామంత్రి వెల్లడించారు. దీంతో వేలాది మంది ఫెయిల్ అయిన విద్యార్ధులకు కూడా ఊరట లభిస్తుందన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+