Spandana: స్పందన పేరు మార్పుపై ఏపీ సర్కార్ క్లారిటీ..!
ఏపీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ స్పందన పేరును మార్చుతూ ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దీనికి పెట్టిన స్పందన పేరు రద్దయింది. ఇకపై దీన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా పిలువబోతున్నారు. దీని వెనుక కారణాలు ఏవైనా కొత్త ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం పెట్టిన పేర్లన్నీ మార్చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ లో క్లారిటీ ఇచ్చింది.
ప్రజా సమస్యలు పరిష్కరించే స్పందన పేరు మార్పు
— YSR Congress Party (@YSRCParty) June 15, 2024
'స్పందన' కార్యక్రమం పేరుని "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్" గా మారుస్తూ ఉత్తర్వులు
జగనన్న ప్రభుత్వం నిర్వహించిన స్పందన పోర్టల్ ని పేరు మార్చి వినియోగించాలని నిర్ణయం
పేర్లు మార్చొచ్చు గానీ ప్రజల కోసం జగనన్న తీసుకొచ్చిన… pic.twitter.com/yGT2kt3hCJ
స్పందన పేరును ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా మారుస్తూ ఇవాళ జారీ చేసిన జీవోపై స్పందిస్తూ వైసీపీ ఇవాళ ఓ ట్వీట్ చేసింది. ఇందులో "ప్రజా సమస్యలు పరిష్కరించే స్పందన పేరు మార్పు 'స్పందన' కార్యక్రమం పేరుని "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్" గా మారుస్తూ ఉత్తర్వులు-జగనన్న ప్రభుత్వం నిర్వహించిన స్పందన పోర్టల్ ని పేరు మార్చి వినియోగించాలని నిర్ణయం- పేర్లు మార్చొచ్చు గానీ ప్రజల కోసం జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలను మాత్రం ఎవరూ తియ్యలేరు." అని పేర్కొంది. దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది.

వైసీపీ ట్వీట్ పై రియాక్ట్ అయిన సర్కార్ ఫ్యాక్ట్ చెక్ లో క్లారిటీ ఇచ్చింది. "ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి 2015 వ సంవత్సరంలో "పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం" ను ప్రవేశ పెట్టారు. ఈ క్రింది వార్త పూర్తిగా అవాస్తవం." అని తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి 2015 వ సంవత్సరంలో "పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం" ను ప్రవేశ పెట్టారు. ఈ క్రింది వార్త పూర్తిగా అవాస్తవం. #ఆంధ్రప్రదేశ్ #AndhraPradesh pic.twitter.com/46jmlDHV4U
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) June 15, 2024












Click it and Unblock the Notifications