Bhola Shankar : భోలా శంకర్ కు జగన్ షాక్ ? బడ్జెట్ పై అనుమానాలు ! తేలితేనే రేట్ల పెంపు..

ఏపీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోలా శంకర్ చిత్రానికి ఇబ్బందులు తప్పేలా లేవు. వైసీపీ సర్కార్ పై తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో భోలా శంకర్ చిత్ర నిర్మాతలు తమ చిత్రం టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

భోలా శంకర్ చిత్రం టికెట్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను చిత్ర నిర్మాతలు తమకు సమర్పించలేదని ప్రభుత్వం చెబుతోంది. సినిమా నిర్మాతలు సరైన డాక్యుమెంట్స్ ఇవ్వలేదని చెప్తున్న ప్రభుత్వ వర్గాలు.ఇతర సినిమాల మాదిరిగా అన్ని వివరాలు సమర్పించలేదని తెలిపారు. అయితే ఈ సినిమాకు, చిరంజీవి కామెంట్స్ కు సంబంధం లేదని చెబుతున్నాయి.

ap government doubts over chiranjeevis bhola shankar movie budget for ticket price hike

భోళా శంకర్ సినిమా ఎల్లుండి విడుదల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో విడుదల అవుతోంది. మిగతా చోట్ల ఇబ్బంది లేకపోయినా ఏపీలో మాత్రం మెగాస్టార్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో చిత్రానికి ఇబ్బందులు తప్పడం లేదు. భోలా శంకర్ చిత్రానికి ఖర్చు పెట్టిన బడ్డెట్ కు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.

భోలా శంకర్ నిర్మాణానికి కేవలం రూ.27 కోట్ల నుంచి రూ.30 కోట్లే ఖర్చయి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. కానీ నిర్మాతలు మాత్రం తమ చిత్రానికి రూ. 150 నుంచి రూ.160 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.

దీనిపైనా ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే సరైన స్పష్టత కోసం మరిన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమా కావడం తో అవసరమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. సరైన డాక్యుమెంట్స్ ఇస్తే టికెట్ రేటు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో నిర్మాతలు ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+