మహిళలకు ఉచిత బస్సు పరిధి పాత జిల్లానా ? కొత్త జిల్లానా ?

ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు సిద్దమవుతోంది. సూపర్ సిక్స్ హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు విషయంలో ఇప్పటికే అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో రాష్ట్ర పరిధిలో ఈ పథకం అమలు చేస్తే ఎంత ఖర్చవుతుంది, అలాగే ఉమ్మడి జిల్లా, కొత్త జిల్లాల పరిధిలో అమలు చేస్తే ఎంతెంత ఖర్చవుతుందన్నది ప్రభుత్వానికి తెలిపారు.

ఈ నేపథ్యంలో నిన్న సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో మహిళలకు ఉచిత బస్సుపై కీలక ప్రకటన చేశారు. జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 నుంచి కల్పించబోతున్నట్లు ప్రకటించారు. అయితే అవి ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త జిల్లాల పరిధా లేక ఉమ్మడి జిల్లాల పరిధా అన్నది మాత్రం చెప్పడం లేదు. దీంతో కొత్త జిల్లాల పరిధిలో ఈ పథకం అమలు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండబోదన్న చర్చ మొదలైంది.

ap government mulling over new or old district limit to free bus travel to women scheme

గతంలో ఎన్నికల హమీ ఇచ్చిన సమయంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని మాత్రమే కూటమి ప్రకటించింది. అయితే అది రాష్ట్ర పరిధిలోనా, జిల్లాల పరిధిలోనా, జిల్లాల్లో అయితే కొత్త జిల్లాలా, ఉమ్మడి జిల్లాలా అని ఎక్కడా చెప్పలేదు. దీంతో ఇప్పుడు ఏ పరిధిలో ఈ పథకం వర్తించేస్తారన్న దానిపై మహిళల్లో ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో నిన్న సీఎం చంద్రబాబు ఈ పథకం జిల్లాల పరిధి వరకే అని చెప్పేశారు.

అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అయితే ఉమ్మడి జిల్లాల పరిధిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎలాగో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరిగేలా మహిళలకు అవకాశం ఇచ్చే పరిస్ధితి లేదు. దీంతో కనీసం ఉమ్మడి జిల్లాల వరకైనా వర్తింపజేస్తే విమర్శలు రాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+