ఏపీలో రక్తదాన కార్యక్రమాలపై నిషేధం.. వారికి మాత్రం మినహాయింపు...

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తితో రక్తం నిల్వలు కూడా అడుగంటిపోతున్నాయి. అదే సమయంలో రక్తదాన శిబిరాల ద్వారా సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వీటితో వైరస్ వ్యాప్తికి అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది.

రక్తదాన శిబిరాలపై నిషేధం..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రక్తదాన శిబిరాల నిర్వహణపై నిషేధం విధించింది. లాక్ డౌన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని ఆస్పత్రుల్లో, బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడింది. దీంతో అక్కడక్కడ రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో బాధితుల పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని రక్తం ఇచ్చేందుకు పలువురు ముందుకొస్తున్నారు. కానీ దీని వల్ల సామాజిక దూరం నిబంధనలు ఉల్లంఘనకు గురికావడం, వైరస్ వ్యాప్తి వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు నివేదికలు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ap govt bans conducting blood donation camps, exempt patients with ids

అత్యవసర కేసుల్లో మాత్రం..

అయితే నిత్యం రక్త మార్పిడి అవసరమైన తలసేమియా, సికిల్ సన్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే రోగుల అవసరాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోగుల రక్తమార్పిడి, చికిత్స, సేవల కోసం సంబంధిత ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది.

ap govt bans conducting blood donation camps, exempt patients with ids

ఆస్పత్రులు ఇచ్చే గుర్తింపు కార్డులను చూపించి పోలీసు పాస్ లు తీసుకుంటే రోగులను అనుమతించాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశాలు పంపింది. ప్రయాణంలో గుర్తింపు కార్డులతో పాటు రక్తం అవసరమైన ఆధారాలను చూపిస్తే పోలీసులు అనుమతి ఇవ్వనున్నారు. వీటి ఆధారంగా పోలీసులు రెగ్యులర్ పాసులు కూడా జారీ చేసేలా ఆదేశాలు ఇచ్చారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+