వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం: కాపుల‌కు 5% రిజర్వేషన్‌ అమలు చేయలేం:ఆ 10 శాతం అందరికీ...!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యాన్ని తేల్చేసారు. కేంద్ర ప్ర‌భుత్వం వి ద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్‌ అమలుపై రాష్ట్ర ప్ర‌భుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులను జారీచేసింది. దీని ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తామిచ్చిన హామీ మేర కు ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేన్ల‌లో అయిదు శాతం కాపుల‌కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణ‌యం అమ‌లు చేయ‌టం లేద‌ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 5% రిజర్వేషన్‌ అమలు చేయలేమ‌ని తేల్చేసింది. ఈడబ్ల్యూఎస్‌లో విభజన కుదరదు అని జీవ‌లో పేర్కొంది. దీంతో..ఇప్పుడు ఆ ప‌ద‌వి శాతం ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లు అంద‌రికీ అమ‌ల‌య్చేలా ఉత్త‌ర్వులు జా రీ చేసింది. దీనికి సంబంధించి విధి విధానాల‌ను ఖ‌రారు చేసింది.

కాపుల‌కు ప్ర‌త్యేక కోటా లేదు..

కాపుల‌కు ప్ర‌త్యేక కోటా లేదు..

కాపుల కోసం గత ప్రభుత్వం చేసిన చ‌ట్టం అమ‌లు కాద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తేల్చేసింది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌ను బీసీల్లో చేర్చే అంశం పైన టీడీపీ హామీ ఇచ్చింది. దీని పైన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నాయ‌క‌త్వంలో ఆందోళ‌న సాగింది. తుని లో రైలు ద‌హ‌నం చోటు చేసుకుంది. ఆ వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం ఇదే అంశం పైన అధ్య‌య‌నం కోసం మంజునాధ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఆ క‌మిటీలో చివ‌ర‌కు ఛైర్మ‌న్ అభిప్రాయం..సంత‌కం లేకుండానే స‌భ్యులు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌కు అనుకూలంగా నివేదిక ఇచ్చారు. అది రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. దాని పైన స్పంద‌న లేక‌పోవంతో..కేంద్రం గ‌త ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌క‌టించిన ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్‌ల్లో కాపుల‌కు అయిదు శాతం కేటాయిస్తూ చ‌ట్టం చేసింది. ఇక‌, ఎన్నిక‌ల త‌రువాత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌టంతో దీనిని కొన‌సాగిస్తారా లేదా అనే చ‌ర్చ అసెంబ్లీలోనూ జ‌రిగింది. తాజాగా...ఏపీ ప్ర‌భుత్వం
ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌లో కాపుల‌కు ప్ర‌త్యేక కోటా లేద‌ని తేల్చి చెప్పింది.

ప‌ది శాతం అంద‌రికీ వ‌ర్తింపు..

ప‌ది శాతం అంద‌రికీ వ‌ర్తింపు..

ఈడబ్ల్యూఎస్‌ 10శాతం రిజర్వేషన్లలో విద్యాసంస్థల్లో సీట్లకు సంబంధించి విభజన కుదరదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్‌ పరిధిలోని అందరికీ వర్తించాలని..దీనిని వేర్వేరుగా వర్గాలకు వర్గీకరించడం నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. దీనికి సంబంధించిన హైకోర్టు తీర్పును తన ఉత్తర్వుల్లో ఉటంకించింది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు తాజా ఉత్తర్వులు వర్త్తిస్తాయని స్ప‌ష్టం చేసింది. అదే స‌మ‌యం లో రిజర్వేషన్లు లేని సామాజిక వర్గాలన్నీ ఈడబ్ల్యూఎస్‌ పరిధిలోకి వస్తాయనే విష‌యాన్ని స్ప‌ష్టంగా పేర్కొంది. కేంద్రం ప్ర‌క‌టంచిన ఈడబ్ల్యూఎస్‌ కింద విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులను 10% కోటాలో సర్దుబాటు చేస్తారు. ఇది కేంద్ర ప్రభు త్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉంటుందని..అదే స‌మ‌యంలో మహిళలకు ఇచ్చే 33శాతం కోటా యథావిధిగా అమలవుతుందనే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో రిజర్వేషన్‌ పొందాలని భావించే వారు తహశీ ల్దారు నుంచి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల‌ని సూచించింది.

ఎందుకు అమ‌లు చేయ‌లేమంటే..

ఎందుకు అమ‌లు చేయ‌లేమంటే..

కేంద్రం స‌వ‌ర‌ణ చేసిన చ‌ట్టం ప్ర‌కారం ఎస్సీ,ఎస్టీ, బీసీలు మినహా ఇతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) విద్యా ప్రవేశాలు, నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లు దక్కాయి. 103 సవరణ చట్టం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లను వర్గీకరించి ఈ ఏడాది ఫిబ్రవరి 20న రెండు చట్టాల్ని తెచ్చింది. ఒక చట్టం ప్రకారం 5శాతం రిజర్వే షన్లు కేవలం కాపులకు, మిగిలిన 5శాతం కాపులు కాకుండా ఇతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించారు. ఆ రెండు చట్టాలు ఈ ఏడాది మార్చి 8నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో అస‌లు కాపులు ఓసీల్లో ఉన్నారా..బీసీల్లో ఉన్నారా అనే విష‌యం పైన గంద‌ర గోళం ఏర్ప‌డింద‌ని శాస‌న‌స‌భ‌లోనూ ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందిగ్ద‌త తొలిగించటానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

English summary
AP Govt sensational decision on EWS reservations implementation in State. Govt stated that in this quota 5 percent for Kapu s is not possible. This reservation implement for all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X