Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ ఖరారు? ఇవాళ సర్కార్ కీలక భేటీ..!

ఏపీలో ఈసారి ఉగాదికి ఎట్టి పరిస్ధితుల్లోనూ జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం.. ఇందుకోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను తెప్పించుకుంది. వాటి ఆధారంగా ఇవాళ కీలక భేటీ నిర్వహించబోతోంది. ఇందులో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలపై తుది నిర్ణయానికి రాబోతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే జాబ్ క్యాలెండర్ విడుదలకు మార్గం సుగమం అవుతుంది.

2026-27 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రంలో ఏర్పడే ఖాళీల భర్తీకి వీలుగా జాబ్ క్యాలెండర్ తయారీ కోసం ఆర్ధిక శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ శాఖలతో సమావేశాలు జరిపి మానవ వనరుల అవసరాలు (ఉద్యోగ ఖాళీలు) పరిశీలించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా దీన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి శాఖలో ఉన్న డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ఖాళీలను దశలవారీగా త్వరలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Job Calendar Finalized AP Government Convenes Crucial Meeting on Vacancies Today

దీంతో ప్రతి శాఖలో ఉన్న పోస్టులు మరియు ఖాళీల వివరాలను జాబితాగా తయారు చేసి సంబంధిత హెచ్ వో డీలు, సెక్రటరీలకు పంపుతారు. శాఖలు తమ వద్ద ఉన్న ఖాళీలను ధృవీకరించి 12 మార్చి 2026 లోపు ఫైనాన్స్ శాఖకు రాతపూర్వకంగా తెలియజేయాలని కోరింది. వీటి ఆధారంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో శాఖల వారీగా అవసరమైన ఉద్యోగాలను ఫైనల్ చేస్తారు. అనంతరం వివిధ శాఖలలో ఉన్న ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+