చేనేత చీరలు, బట్టలపై 40 శాతం డిస్కౌంట్, ఏపీలో స్టాల్స్ అక్కడే.. త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సమయంలో ఒక శుభవార్త చెప్పింది. ముఖ్యంగా చేనేతలకు కూడా చేయూతను అందించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల జీవితాలు చేనేత రంగం పైన ఆధారపడిన క్రమంలో వారికి చేయూతనివ్వడానికి, మహిళలకు మాత్రమే కాదు అన్ని వర్గాల వారికి నాణ్యమైన వస్త్రాలను అందించడానికి ఏపీ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది.

చేనేతలకు మద్దతుగా ఏపీ సర్కార్ నిర్ణయం

చేనేత కార్మికులకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత స్టాళ్లను ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు అందుబాటులో ఉండే ఈ స్టాల్స్ నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డాయి.

AP Govt Sets Up APCO Handloom Stalls at Assembly good news for women and handloom workers

భారీ డిస్కౌంట్ తో చేనేత చీరల విక్రయం

ఈ స్టాల్స్ లో ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, మాధవరం చీరలు, పొందూరు షర్ట్ లు, పంచెలు, కండువాలతో పాటు రెడీమేడ్ దుస్తులు కూడా విక్రయిస్తున్నారు. ఇక చేనేతల కొనుగోళ్లు ప్రోత్సహించడం కోసం భారీ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. 40% డిస్కౌంట్ తోనే చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అసెంబ్లీలో చేనేత స్టాల్స్

ముఖ్యంగా మహిళల కోసం నాణ్యమైన చేనేత చీరలు ఎనిమిది వందల రూపాయలు నుంచి 26 వేల రూపాయల వరకు వివిధ ధరలలో అందుబాటులో ఉన్నాయి. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ లో అసెంబ్లీకి వచ్చిన వారంతా వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బడ్జెట్ సమావేశాలకు వచ్చిన వారంతా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా నేతను లకు ఆర్థిక భరోసా లభిస్తుంది.

చేనేత వస్త్రాలు కొనాలని సూచన

అసెంబ్లీ స్టాళ్లలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలను వచ్చిన వారంతా కొనుగోలు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేలను కోరారు. చేనేత స్టాళ్లను సందర్శించిన మంత్రి సవిత సైతం చేనేతలకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి వచ్చే వారంతా చీరలను, బట్టలను కొనుగోలు చేస్తే నేతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తుందని వారంతా అభిప్రాయపడ్డారు. ప్రజలకు కూడా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని సూచించారు.

చేనేత వృత్తికి వెన్నుదన్నుగా స్టాల్స్

వారంలో ఒక్కరోజు చేనేత దుస్తులు ధరించడం ద్వారా సాంప్రదాయమైన చేనేత వృత్తికి వెన్నుదన్నుగా నిలిచిన వారు అవుతామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు ఎంతో కష్టపడి నేసిన చేనేత చీరలను, వస్త్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం మనందరి పైన ఉందన్నారు. ఏపీ చేనేతలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఘనత ఉందని తెలిపారు.

నేతన్నలను ఆదుకోవటానికి ముందుకు ప్రభుత్వం

ఆప్కో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించి, చేనేత, జౌళి శాఖాధికారులకు మన రాష్ట్రంలో తయారైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత వస్త్రాలను అమ్మకానికి పెట్టాలని ఆదేశించారు. ఏ మాత్రం అవకాశం దొరికినా చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని మంత్రి సవిత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+