వార్నింగ్... బంగాళాఖాతంలో జులై 20న మరో అల్పపీడనం!!
నైరుతి రుతుపవనాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం మొదలు కాగా కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
జులై 20 మరో అల్పపీడనం
ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ జిల్లాలో చల్లటి వాతావరణం వుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదవుతాయి. జులై 20 మరో అల్పపీడనం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 20,21,22 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
నేడు రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురుగా భారీవర్షాలు పడే అవకాశం ఉంది. విజయనగరం, మన్యం,అల్లూరి సీతారామరాజు,విశాఖ,అనకాపల్లి, కాకినాడ,ఏలూరు,కర్నూలు, అనంతపురం,శ్రీసత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారువర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలినచోట్ల ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి వర్షాలుపడే అవకాశం ఉంది.అంతేకాదు ఆవర్తనం ప్రభావంతో రేపు,ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు.
పిడుగులు పడతాయి జాగ్రత్త
మంగళ,బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించామన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్న కారణంగా వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, రైతు కూలీలు, గొర్రెల, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చెట్ల క్రిందకు వెళ్లొద్దు అని, మొబైల్ ఫోన్స్ వాడొద్దు అని సూచిస్తున్నారు.
ఏపీలో వర్షాలపై ఐఎండీ అంచనా
ఏపీలో వర్షాలపై ఐఎండీ అంచనాల నేపధ్యంలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి.కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వర్షాల నేపద్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.












Click it and Unblock the Notifications