చంద్రబాబుకు హైకోర్టు మరిన్ని షరతులు-రేపటి వరకూ ర్యాలీలొద్దు, మీడియాతో మాట్లాడొద్దు..

ఏపీలో స్కిల్ స్కాం కేసులో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. అనంతరం సీఐడీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణ తర్వాత మరిన్ని షరతులు విధించింది. బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు విధించిన షరతులతో పాటు మరో ఐదు షరతులు కూడా విధించాలని సీఐడీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది.

చంద్రబాబుకు స్కిల్ కేసులో హైకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు విధించిన షరతులకు తోడు మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ మంజూరు సందర్భంగా ఈ షరతులు కూడా చేర్చాలని కోరగా.. మరో పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో సీఐడీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో చంద్రబాబును బెయిల్ సమయంలో రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టకుండా ఆంక్షలు విధించాలని కోరింది.

ap high court put additional conditions to chandrababu bail, accept cids request

అలాగే మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, వైద్యం కోసమే బెయిల్ ను ఉపయోగించేలా చూడాలని హైకోర్టును సీఐడీ కోరింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడకుండా నిలువరించాలని కోరింది. వీటితో పాటు ఇద్దరు డీఎస్పీ స్ధాయి అధికారులు చంద్రబాబుతోనే ఉంటూ ఆయన కదలికలు కోర్టుకు సమర్పించాలని కూడా కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వీటిలో కొన్ని షరతులకు అంగీకారం తెలిపింది.

ఇందులో రేపటి వరకూ చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే రేపటి వరకూ మీడియాతో మాట్లాడొద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనకుండా చూడాలని చంద్రబాబు లాయర్లను హైకోర్టు ఆదేశించింది. దీంతో చంద్రబాబు ఈ మూడు షరతులను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+