కేసుల్లో కూటమికీ, వైసీపీకీ తేడా ఇదే..! తేల్చేసిన హోంమంత్రి..!

ఏపీలో కూటమి ఎమ్మెల్యేల్లో 94 శాతం మందిపై కేసులున్నాయంటూ తాజాగా వెలువడిన ఓ రిపోర్టు కలకలం రేపింది. దీనిపై ఇవాళ శాసనమండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె కూటమి ఎమ్మెల్యేలపై కేసులకూ, వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులకూ మధ్య ఉన్న తేడా ఏంటో వెల్లడించారు. అయితే దీంతో సంతృప్తి చెందని వైసీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన తప్పుడు, అక్రమ కేసులపై శాసన మండలిలో ఇవాళ జరిగిన చర్చలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడితే వందలాది మందిపై కేసులు పెట్టారని, తనపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంతో కడప కోర్టుకు వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వ చీకటి జీవోలు తెచ్చే సంస్కృతిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగించదన్నారు.

AP Home Minister Anitha Clarifies Differences Between Cases Against NDA and YSRCP

అన్ని కేసులను చట్ట ప్రకారం పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అనిత తెలిపారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యమించిన టీచర్లపై నమోదైన కేసుల్లో 80శాతం ఎత్తివేశామని, మిగిలిన కేసుల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 2019 నుండి 2024 మధ్యకాలంలో మొత్తం 3,116 తప్పుడు కేసులు పెట్టిందని అనిత తెలిపారు. ఈ కేసుల్లో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన సాధారణ ప్రజలపై కూడా కేసులు పెట్టారన్నారు.

కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే లేదా ఫార్వార్డ్ చేసినందుకే ప్రజలపై కేసులు పెట్టారని అనిత ఆరోపించారు. అమరావతి రైతులు రాజధాని కోసం చేసిన ఉద్యమంలో వందలాది కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో కొన్ని విచారణ దశలో ఉండగా, మరికొన్ని ట్రయల్ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని కేసులు కోర్టుల పరిధిలో విచారణలో ఉన్నాయన్నారు. దీనిపై సీఎం చంద్రబాబుతో కలిసి సమీక్షిస్తామన్నారు.

మరోవైపు ఇటీవల సాక్షి పత్రికలో ఎన్డీయే కూటమి సభ్యుల్లో 94 శాతం మందిపై కేసులున్నాయన్న వార్తలపై స్పందిస్తూ అనిత.. వారు గుర్తించాల్సింది ఒక్కటే - మా నాయకులపై కోడి కత్తి కేసులు, గొడ్డలి వేటు కేసులు, లేదా తల్లి, చెల్లెలు పేరుతో పెట్టిన పర్సనల్ కేసులు లేవు. ఇవన్నీ రాజకీయ కేసులే. గత ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎత్తిచూపినందుకు మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయి అని హోంమంత్రి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+