కానిస్టేబుల్ ఉద్యోగార్ధులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్-హోంమంత్రి డెడ్ లైన్ ఇదే..!

ఏపీలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్టంలో గతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. దీనికి సంబంధించి చేపడుతున్న ప్రక్రియను ఆమె ఇవాళప్రకటించారు. దీని ప్రకారం ఐదు నెలల్లో పెండింగ్ పరీక్షలు పూర్తి చేస్తారు.

గతంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సి శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వీటిని ను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని హోంమంత్రి ఇవాళ ప్రకటించారు. 2022లో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా వీరిలో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడడంతో 3580 సివిల్ కానిస్టేబుల్, 2520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల ప్రక్రియ వాయిదా పడిందన్నారు.

ap home minister vangalapudi anitha announced deadline for finishing constable recruitment

అప్పట్లో ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరు కాగా అందులో 382 మంది మాత్రమే అర్హత సాధించారన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశారనన్నారు. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా ప్రత్యేక కోటాలో విడిగా మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరారన్నారు. ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రి వివరించారు.

అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియను గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిందని హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు హోంమంత్రి వెల్లడించారు. కాబట్టి దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి, భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (slprb.ap.gov.in) వెబ్సైట్ లో పొందుపరుస్తామని అనిత తెలిపారు. రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశ ప్రధాన పరీక్ష (Final Written Exam) ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+