ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల: స్టెప్ బై స్టెప్- పూర్తి వివరాలివీ

AP Mega DSC 2025: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.

https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in అనే వెబ్‌సైట్ల ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నోటీఫికేషన్ వివరాలు వెల్లడించారు.

దరఖాస్తులను దాఖలు చేయడానికి అభ్యర్థులు ఆయా వెబ్‌సైట్‌లను సందర్శించాలి. కొత్త యూజర్లు తప్పనిసరిగా యూజర్ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అందులో సూచించిన ఫామ్‌ను నింపాలి. అది భర్తీ చేసిన తరువాత వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందుతుంది.

AP Mega DSC 2025 Andhra govt issue notification to recruit 16347 teachers

యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందిన తరువాత DSC 2025 అప్లికేషన్ ఫామ్‌లో సూచించిన ప్రొఫైల్‌లో తమ పూర్తి వివరాలను పొందుపరచాలి. ఫొటో తప్పనిసరి. దీనితో సెక్షన్ 1 పూర్తి అయినట్టవుతుంది. ఆ తరువాత సెక్షన్‌ 2లోకి వెళ్లాలి.

సెక్షన్ 2లో అభ్యర్థులు తమ అకడమిక్, విద్యార్హతలను పొందుపరచాలి. 4 నుంచి 10వ తరగతి వరకు ఏ జిల్లాల్లో చదివారో అందులో క్షుణ్ణంగా వివరించాలి. అండర్ గ్రాడ్యుయేట్ అయితే- అక్కడ చూపించిన యూజీ అనే బటన్‌ ప్రెస్ చేయాలి.

దీని తరువాత APTET Qualification వివరాలను అందులో మెన్షన్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడానికి ఇది అవసరం. అదనపు అర్హతలు ఏవైనా ఉంటే ఇందులో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. దీనితో దరఖాస్తు ఫామ్ పూర్తిగా నింపినట్టవుతుంది. సబ్మిట్ బటన్ నొక్కడానికి ముందు తాము అందజేసిన వివరాలన్నింటినీ అభ్యర్థులు సరి చూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. అనంతరం చెక్ బాక్సులను టిక్ చేయాలి.

ఆ తరువాత సెక్షన్ 3 ఓపెన్ అవుతుంది. ఇందులో- అభ్యర్థులు తమ జిల్లా, జోన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఏ జిల్లాల్లో, ఏ సబ్జెక్టులో ఎన్ని డీఎస్సీ పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ చూడొచ్చు. పరీక్షా కేంద్రాన్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే 1,500 రూపాయల పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+