వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కామెడీ పీస్- గౌరవం అంటే ప్యాకేజీయేగా ? జనం వస్తోంది అందుకే ! అంబటి సెటైర్లు..

|
Google Oneindia TeluguNews

ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవని పవన్..కామెడీ పీస్ అని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈసారి చంద్రబాబుతో కలిసి వచ్చినా రాజకీయ మరణం తథ్యం అన్నారు. పవన్ మాటలకు అర్థాలే వేరంటూ చుకలకు అంటించారు. జనసే అధ్యక్షుడికి దమ్ము, ధైర్యం లేదని అందుకే పిరికి సన్నాసిలా మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.

చంద్రబాబు కోసమే పవన్ జనసేన పార్టీ పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుతో పవన్‌ ఏం మాట్లాడాడో అన్నీ త్వరలోనే బయటపెడతామన్నారు. టీడీపీకి అమ్ముడుపోయేందుకే పవన్ కల్యాణ్ ఆరాటం అన్నారు. చెప్పులు తీసి కొడతామనడం రాజకీయమా..? అంటూ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.

పవన్‌కళ్యాణ్‌ శ్రీకాకుళం జిల్లా రణస్థలం యువశక్తి సభలో చాలా విషయాలు మాట్లాడారని, అదే సమయంలో ఒక విషయం స్పష్టం చేశారని అంబటి అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి తనకు లేదని, అందుకే చంద్రబాబు తోడు కావాలని చాలా క్లియర్‌గా చెప్పారన్నారు. అలా చెప్పి ఊర్కుంటే మంచిదేనన్నారు. కానీ తాను పిరికివాణ్ని కాదని, చాలా ధైర్యవంతుడినని, దేన్నీ లెక్క చేయనని అంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ మీదకు మాత్రం ఒంటరిగా వెళ్లలేనన్నారు. ఎవరి తోడైనా ఉంటేనే వెళ్లగలుగుతాను అంటున్నాడన్నారు. అందుకే మీ వీడియో చూస్తే ధైర్యవంతులో.. లేక పిరికివారో అన్న విషయం మీకే అర్ధమవుతుందన్నారు.

 ap minister ambati rambabu strong counter to pawan kalyans remarks on ys jagan

సింగిల్‌గా వెళ్లి తాను వీర మరణం పొందలేనని పవన్‌ చెబుతున్నారని, నువ్వేమైనా యుద్ధానికి వెళ్తున్నావా? అని అంబటి ప్రశ్నించారు. ఎన్నికలకు వెళ్తున్నావు. దానికి అంత గొప్ప పేరెందుకు? అసలు నీకు ఇంత వరకు రాజకీయాల్లో జన్మ లేదు. నీవు పార్టీ పెట్టావు. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. అంటే నీకు ఇప్పటి వరకు జన్మ అనేదే లేదు. అలాంటప్పుడు మరణం ఏమిటి? దానికి అంత పేరెందుకు? పుస్తకాల్లో చదివి గొప్ప గొప్ప పదాలు వాడినంత మాత్రాన మీరు గొప్ప నాయకుడు కారన్నారు.

English summary
ap minister ambati rambabu on today lambasted on janasena chief pawan kalayn for his remarks against ysrcp govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X