చంద్రబాబుపై కన్నబాబు సెటైర్లు-మంగళగిరిలో లోకేష్ ఓటమి తట్టుకున్న గుండె-కుప్పమో లెక్కా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండోరోజు సభలో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు టీడీపీ హయాంలో చోటు చేసుకున్న పరిస్దితులు, వైసీపీ సర్కార్ హయాంలో చేపడుతున్న సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.
ఇదే క్రమంలో చంద్రబాబుపై వ్యవసాయమంత్రి కన్నబాబు సెటైర్లు వేశారు. ముఖ్యంగా కుప్పంలో టీడీపీ ఓటమిని ప్రస్తావిస్తూ మంగళగిరిలో తనయుడు లోకేష్ ఓటమినే తట్టుకున్న గుండె అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. మంగళగిరిలో లోకేష్ ఓటమినే తట్టుకున్న గుండెకు కుప్పంలో ఓటమి ఓ లెక్కకాదంటూ కన్నబాబు వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ శిబిరంలో నవ్వులు వినిపించాయి.. ప్రతిపక్షం వైపు మౌనం కనిపించింది. చంద్రబాబు కూడా తలదించుకుని ఉండిపోయారు. ఆయన వెనకున్న అచ్చెన్నాయుడు మాత్రం నవ్వుకున్నారు.

ఆ తర్వాత మాత్రం వ్యవసాయమంత్రి కన్నబాబు చేసిన వరుస విమర్శలతో టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయార. కాసేపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. అదే సమయంలో పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అమూల్ ను వద్దంటున్న టీడీపీపై విమర్శలకిు దిగారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పీకర్ వెల్ వద్దకు వచ్చారు. అనంతరం వారిని స్పీకర్ వారించి తమ స్ధానాల్లోకి పంపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఏదో మాట్లాడబోతుండగా టీడీపీ నిరసనకు దిగడంతో స్పీకర్ వారించారు.
తాజాగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో నిన్న శాసనసభకు చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారని ఎదురుచూసిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం జగన్ కు నిరాశ ఎదురైంది. సాయంత్రం వరకూ వేచి చూసినా చంద్రబాబు రాలేదు. దీంతో సీఎం జగన్ తన ప్రసంగంలో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఇవాళ చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాగానే వైసీపీ మంత్రులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications