వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్కూళ్ళ నిర్వహణపై సందిగ్ధతకు చెక్ .. తెలంగాణాకు భిన్నంగా విద్యా శాఖా మంత్రి ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది . దీంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు ,కళాశాలలు తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించింది. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని సూచించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ళు, కాలేజీల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

ఏపీలో స్కూళ్ళు యధావిధిగా కొనసాగుతాయన్న మంత్రి ఆదిమూలపు సురేష్

ఏపీలో స్కూళ్ళు యధావిధిగా కొనసాగుతాయన్న మంత్రి ఆదిమూలపు సురేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేసులు బాగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడి చేయడం కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే స్కూళ్ళ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భిన్నంగా స్పందించింది ఏపీ సర్కార్ . ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి కుదరదని , స్కూళ్లకు సెలవులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ళు కొనసాగుతాయని, ప్రస్తుతానికి పాఠశాలలకు సెలవు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

 ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇబ్బందులు

ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇబ్బందులు


స్కూళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు ,ఉపాధ్యాయులు కరోనా నిబంధనలను పాటించాలని, మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూర నిబంధనలు అవలంబించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

 తెలంగాణలో స్కూళ్ళు , కాలేజీలు బంద్ .. ఏపీలో అందుకు భిన్నంగా కొనసాగింపు నిర్ణయం

తెలంగాణలో స్కూళ్ళు , కాలేజీలు బంద్ .. ఏపీలో అందుకు భిన్నంగా కొనసాగింపు నిర్ణయం

తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు ,కాలేజీలు బంద్ ప్రకటించి కరోనా నియంత్రణ చర్యలు చేపడితే, ఏపీ ప్రభుత్వం కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నామని , స్కూళ్ళు యధావిధిగా కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఇప్పటికే గత విద్యాసంవత్సరం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో విద్యార్థులు నష్టపోయారు అన్న భావనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అందుకే స్కూల్స్ నడపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.

 ఏప్రిల్ 1 నుండి ఒంటి పూట స్కూళ్ళ నిర్వహణ

ఏప్రిల్ 1 నుండి ఒంటి పూట స్కూళ్ళ నిర్వహణ


భారతదేశంలో ఇటీవల పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా అనేక రాష్ట్రాల్లోని పాఠశాలలు మళ్లీ మూసివేయబడుతున్నాయి . మరింత అప్రమత్తంగా ఉన్న ఈ సమయంలో, ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు 1 నుండి 10 తరగతుల విద్యార్థుల కోసం తరగతులను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది .

2021 ఏప్రిల్ 1 నుండి 1 నుండి 10 వరకు విద్యార్థుల కోసం ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు .ఎపి పాఠశాలలు ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిములాపు సురేష్ ప్రకటించారు.

బోర్డు పరీక్షల దృష్ట్యా తరగతుల నిర్వహణకు నిర్ణయం

బోర్డు పరీక్షల దృష్ట్యా తరగతుల నిర్వహణకు నిర్ణయం


కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తర్వాత గతేడాది నవంబర్ 2020 నుండి 6 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను తిరిగి తెరిచినప్పటికీ, 1 నుండి 5 తరగతులకు స్కూల్స్ ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమయ్యాయి .

10, 12 తరగతులకు రాబోయే బోర్డు పరీక్షల దృష్ట్యా సీనియర్ తరగతుల కోసం పాఠశాలలను తిరిగి ప్రారంభించే చర్య తీసుకోబడింది.

ఈ తరుణంలో స్కూల్స్ క్లోజ్ చేస్తే మంచిది కాదని ఏపీ సర్కార్ భావిస్తుంది.

English summary
At a time when schools in several states are shutting again or becoming more alert due to the recently rising Covid-19 cases in India, Andhra Pradesh schools would be continuing with physical classes for students of classes 1 to 10.AP Education Minister Adimulapu Suresh has said that schools will continue in the state of Andhra Pradesh and there is no school holiday at present. He said conducting classes online was causing serious difficulties for students studying in government schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X