జగన్ కేబినెట్ విస్తరణపై విపక్షాల్లో ఉత్కంఠ-అదే టర్నింగ్ పాయింట్-2024 పోరుపై క్లారిటీ

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం జగన్ కేబినెట్ ప్రక్షాళనకు సిద్దమవుతున్నారు. ఇప్పడుతున్న మంత్రుల స్ధానంలో కొత్త మంత్రుల్ని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయంగా పట్టు చిక్కడం లేదని భావిస్తున్న విపక్షాలకు వరంగా మారబోతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. భారీ సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటు దక్కకపోతే ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

జగన్ కేబినెట్ కసరత్తు షురూ

జగన్ కేబినెట్ కసరత్తు షురూ

ఏపీలో జగన్ కేబినెట్ విస్తరణ వ్యవహారం ఇప్పుడు వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. పాత మంత్రుల్లో ఎంతమందికి కొనసాగింపు ఉండొచ్చు, మరెందరికి ఉద్వాసన ఉండొచ్చనే అంశాలతో పాటు కొత్తగా కేబినెట్ బెర్తులు దక్కించుకునే వారిపైనా చర్చ సాగుతోంది. ఇందులో ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో ఈ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది.

అసలే రెండున్నరేళ్లకు జరుగుతుందని భావించిన కేబినెట్ ప్రక్షాళన కాస్తా వివిధ కారణాలతో మూడేళ్లకు మారిపోయింది. దీంతో ఇక మిగిలిన రెండేళ్లలో ఎన్నికల ఏడాది మినహాయిస్తే మిగిలిన ఏడాది, ఏడాదిన్నర కాలానికి మంత్రులుగా అవకాశం దక్కించుకోబోయే వారిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

భారీ అంచనాలతో

భారీ అంచనాలతో

కేబినెట్ ప్రక్షాళనలో ఈసారి తమకు కచ్చితంగా చోటు దక్కుతుందని ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 40-50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో కేవలం 25 మందికి మాత్రమే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మొత్తం కేబినెట్ మార్చకపోతే మాత్రం అంతకంటే తక్కువ మందికే అవకాశం దక్కొచ్చు.

అప్పుడు ఆశావహుల్లో చాలా మందికి నిరాశ తప్పదు. ఆ పరిస్ధితిని నివారించేందుకు వైసీపీ అధిష్టానం ఇప్పుడు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలుపు బాట పట్టించే వారు, తాము గెలుస్తూ ఇతరుల్ని గెలిపించే పరిస్ధితుల్లో ఉన్న వారికి ప్రయారిటీ ఉంటుందని చెప్తున్నారు.

 తేడా వస్తే అసంతృప్తులకు ఛాన్స్

తేడా వస్తే అసంతృప్తులకు ఛాన్స్

కేబినెట్ విస్తరణలో ఊహించిన స్ధాయిలో అవకాశాలు దక్కకపోతే మాత్రం ఇప్పటి వరకూ వైసీపీలో అవకాశాల కోసం మౌనంగా ఉన్న వారంతా కచ్చితంగా గళం విప్పుతారనే అంచనాలున్నాయి. ఇందులోనూ సామాజిక వర్గాల వారీగా కేటాయించే బెర్తుల్లో ఏమాత్రం అన్యాయం జరిగినా అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న సామాజిక వర్గాల వారికే తిరిగి అవకాశం దక్కుతుందన్న గ్యారంటీ లేదు. అటువంటప్పుడు వారిని ఎలా బుజ్జగిస్తారన్నది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. దీంతో ఆశావహుల కంటే అసంతృప్తుల్ని దృష్టిలో ఉంచుకునే ఈసారి జగన్ తన కేబినెట్ ప్రక్షాళన చేపట్టాల్సి ఉంటుందన్న చర్చ నడుస్తోంది.

 విపక్షాల ఆశలన్నీ వారిపైనే

విపక్షాల ఆశలన్నీ వారిపైనే

ఇప్పటికే కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్న వారు తమకు కచ్చితంగా అవకాశం దక్కుతుందనే చెప్పుకుంటున్నారు. గతంలో జగన్ స్వయంగా హామీ ఇచ్చిన వారి పరిస్ధితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అలాంటి వారిలో ఎక్కడైనా ఎవరికైనా పదవి దక్కకపోతే మాత్రం వారంతా రెబెల్స్ గా మారడం ఖాయం. సరిగ్గా ఇలాంటి పరిస్ధితిని కోరుకుంటున్న విపక్షాలు కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి.

ముఖ్యంగా వైసీపీలో అసంతృప్తుల్ని, సామాజిక వర్గాల్లో అసంతృప్తిని క్యాష్ చేసుకుంటే రాష్ట్ర రాజకీయంపై తమకు మరోసారి పట్టు చిక్కుతుందన్న అంచనాల్లో విపక్షాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్ లో ఉంటూ పదవులపై విపక్షాల నేతలు, కార్యకర్తలు కూడా ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+